Keerthy Suresh: స్టార్ తెలుగు హీరో కొడుకుకి కీర్తి సురేష్ అత్త అవుతుందంట.. ఇంతకీ ఎవరంటే..!

Keerthy Suresh: మలయాళం స్టార్ హీరోయిన్ మేనక వారసురాలిగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. చిరంజీవి - సిమ్రాన్ జంటగా నటించిన డాడీ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలలో నటించింది. కానీ క్యారెక్టర్ కు సూట్ కాలేదని అక్కడి నుంచి ఆమెను తప్పించారు. ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా మరే సినిమా చేయలేదని సమాచారం. ఆ తర్వాత హీరోయిన్ గా మారి రామ్ సరసన నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాతో మంచి పేరు కూడా దక్కించుకుంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట.  అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 

1 /5

ఇటీవల రెబల్ స్టార్ ప్రభాస్ తో కల్కి 2898AD చిత్రానికి దర్శకత్వం వహించి భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్,  గతంలో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషిస్తూ తెరకెక్కించిన చిత్రం మహానటి. ఈ సినిమా మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో కీర్తి సురేష్ సావిత్రి క్యారెక్టర్ లో జీవించేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో  ఏకంగా జాతీయ అవార్డు అందుకోవడమే కాదు ఇప్పటికీ మహానటి అని పిలిపించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.  

2 /5

ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ఒక స్టార్ హీరో కొడుకుకి అత్త అవుతుందట అది ఎలాగో ఆమె మాటల్లోనే విందాం. 

3 /5

మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలో మొదటిసారి గ్లామర్ రోల్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది కీర్తి సురేష్.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాచురల్ స్టార్ నాని కొడుకు తనను ముద్దుగా అత్త అని పిలుస్తారని, అలా పిలిస్తే తాను ఎంతో సంతోషపడతానని కూడా చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.   

4 /5

పోయినసారి నా బర్త్ డే కి నాని కొడుకు నాకు ఒక వాయిస్ పంపించాడు. అది నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. నన్ను అతడు అత్త అని పిలుస్తాడు. అంతేకాదు మిస్ యు, సీ యు అనే పదాలు కూడా చాలా క్యూట్ గా పలుకుతాడు అంటూ ఆ అబ్బాయి పంపించిన వాయిస్ క్లిప్ ను ప్లే చేసింది కీర్తి సురేష్. కీర్తి అత్త హ్యాపీ బర్త్డే .. మూసీ.. సూయీ.. అంటూ నాని కొడుకు చాలా క్యూట్ గా చెప్పిన వాయిస్ రికార్డును ఆమె సేవ్ చేసి పెట్టుకున్నదట. 

5 /5

తాను వర్క్ టెన్షన్ లో ఉన్నప్పుడు ఈ వాయిస్ కచ్చితంగా వింటానని, అప్పుడే తనకు రిలీఫ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది.  సో అదన్నమాట నాచురల్ స్టార్ హీరో నాని కొడుకికి కీర్తి సురేష్ అత్త అవుతుందని సమాచారం.