యాసంగిలో పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ రాష్ట్ర తరహాలో FCI ద్వారా వరి ధాన్యాన్ని సేకరించాలని మరోసారి సీఎం కేసీఆర్ పోరు బాట చేయనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, పార్లమెంట్‌లో నిరసనలు, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో చర్చల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులతో భేటీ అయ్యేందుకు సీఎంవో పర్మిషన్ కోరింది.
ఈ సమావేశానికి సమావేశానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్‌లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల అధ్యక్షులు, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మెన్‌లు సమావేశానికి హాజరయ్యారు.
వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, నిరసన, ధర్నాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేయనున్నట్లు సమాచారం.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశం తరువాత సీఎం, మంత్రులు కలిసి ఢిల్లీ బయలుదేరనుంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని కోరనున్నారు.
తెలంగాణలో యాసంగిలో పండిన 50 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోళ్లు చేయాల్సింది ఉండగా.. వానాకాలానికి సంబంధించిన 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా నిల్వ ఉంది
తెలంగాణ భవన్‌లో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ ఇతర అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు.