Kalki 2898 AD OTT News: ‘కల్కి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్..


Kalki 2898 AD OTT News: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’, ఈ సినిమా గత నెల 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను థియేటర్స్ లో చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులు ఫలించే రోజులు వచ్చాయి.

 

1 /7

రెబల్ స్టార్ ప్రభాస్..ఇది పేరు కాదు ఇట్స్ బ్రాండ్.  ‘కల్కి 2898 AD’ మూవీతో పూటకో రికార్డును బ్రేక్ చేస్తున్నాడు. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా $19 మిలియన్స్ డాలర్స్ రాబట్టి బాహుబలి 2 తర్వాత రెండో ప్లేస్ లో నిలిచింది.

2 /7

అంతేకాదు కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 1100 కోట్ల గ్రాస్ (రూ. 555 కోట్ల షేర్) వసూల్లతో దూసుకుపోతుంది. ఈ వీకెండ్ తో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగుస్తుందనే చెప్పాలి.

3 /7

ఏది ఏమైనా బాహుబలి 2 తర్వాత సలార్ తో పవర్ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకున్నాడు. అంతేకాదు బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కు కల్కి రెండో వెయ్యి కోట్ల మూవీ.

4 /7

తాజాగా కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషలకు సంబంధించి ఆగష్టు 15 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

5 /7

ఈ సినిమా విడుదలైన ఏడు వారాలకు ఈ సినిమాను ఓటీటీలో ప్రదర్శించేలా ముందే ఒప్పందం చేసుకున్నారు. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం కాబట్టి ఈ రోజున ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.  

6 /7

ప్రభాస్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈ యేడాది చివర్లో మంచు విష్ణుతో చేస్తోన్న ‘కన్నప్ప’ డిసెంబర్ లో విడుదల కానుంది. అటు మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

7 /7

మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సలార్ పార్ట్ 2  శౌర్యంగ పర్వం’, ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ ఈ యేడాది చివర్లో పట్టాలెక్కనుంది. అటు హను రాఘవపూడితో చేస్తోన్న ఫౌజీ, అటు సిద్ధార్ధ్ ఆనంద్ చిత్రాలు లైన్ లో ఉన్నాయి.