Janhvi Kapoor: సాంప్రదాయ చీరకట్టులో మహాలక్ష్మిలా మెరిసిపోతున్న దేవర భామ జాన్వీ కపూర్..

Jahnvi Kapoor:  జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా  సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు తల్లి బాటలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో పడింది.  అంతేకాదు తల్లి శ్రీదేవి బాటలో తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ కావాలని ప్రయత్నాలు షురూ చేసింది. అందుకు  దక్షిణాది సినీ ఇండస్ట్రీని నమ్ముకుంది.  తాజాగా సాంప్రదాయ చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.

1 /6

జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు ఆరేళ్లు పూర్తి కావొచ్చింది. అయినా ఇప్పటికీ హీరోయిన్ గా  సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి.  అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసింది శ్రీదేవి తనయ. 

2 /6

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఫేమ్ తెచ్చుకోవడం పక్కా  జాన్వీ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతుంది.  

3 /6

మొత్తంగా తెలుగులో తారక్ తో చేస్తోన్న దేవర రెండు పార్ట్ లతో  పాటు రామ్ చరణ్‌ తో RC 16 మూవీలతో ఇక్కడ తెలుగులో జాన్వీ  తెలుగులో సత్తా చాటడం పక్కా అని చెబుతున్నారు ఆమె అభిమానులు.      

4 /6

ఫస్ట్ సినిమా 'ధడక్‌' చిత్రంతో  సినీ రంగ ప్రవేశం చేసింది జాన్వీకపూర్. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన ఎక్కువ చిత్రాలు ఓటీటీ వేదిక‌గానే విడుదలయ్యాయి.

5 /6

జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస అవకాశాలు వస్తున్నాయి. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా బడా స్టార్ హీరోల సినిమాలతో తెలుగులో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

6 /6

జాన్వీ కపూర్..రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో  పాటు ప్రభాస్, హను రాఘవపూడి ‘ఫౌజీ’ చిత్రంలో దాదాపు జాన్వీ కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.