Bhagyashri Borse: తెలుగు హీరోలందరి చూపు మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పైనే..

Bhagyashri Borse:టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో  రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ భామ.. రిలీజ్ తర్వాత ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.  

1 /7

‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో భాగ్యశ్రీ అంద చందాలకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఇందులో క్యూట్ క్యూట్ అందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా సక్సెస్ నేపథ్యంలో ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

2 /7

తెలుగులో బడా హీరోలైన ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో ఈ భామను తీసుకోవాలనుకుంటున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కోసం రష్మిక మందన్న ఆల్రెడీ ఫిక్స్ అయినట్టు సమాచారం. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.

3 /7

భాగ్యశ్రీ బోర్సే ది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ ఈమె స్వస్థలం. నటి కాకముందు పలు కంపెనీలకు  మోడల్ గా  పని చేసింది. యాక్ట్రెస్ గా ఫస్ట్ మూవీనే రవితేజ వంటి సీనియర్ హీరో సరసన లభించడం మాములు విషయం కాదు. ఈ సినిమాలో రవితేజతో భాగ్యశ్రీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

4 /7

మాస్ మహారాజ్ కూడా ఈ సినిమాలోని పాటల్లో భాగ్యశ్రీని  టచ్ చేయకూడని అందాలను సైతం  టచ్ చేయడంపై పెద్ద దుమారమే రేగినా.. ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది.  

5 /7

అంతేకాదు ఈ మధ్యకాలంలో ముంబై నుంచి వచ్చిన హీరోయిన్స్ కు వేరే వాళ్లు డబ్బింగ్ చెప్పడం షరా మాములే. కానీ ఈమె పట్టుబట్టి.. తెలుగు నేర్చుకొని.. ఫస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ కోసం తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఈ రేంజ్ లో ముంబై భామ ఫస్ట్ మూవీతోనే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం వంటివి చూస్తే నటిగా ఆమె తాపత్రయం ఏంటో తెలుస్తోంది. 

6 /7

బహుశా తెలుగులో విజయశాంతి సహా  ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న ఏ బడా హీరోయిన్స్ ఎవరు కూడా ఇలా ఫస్ట్ సినిమాతోనే తమ పాత్రకు తామే డబ్బింగ్ చెప్పుకున్న సందర్భాలు లేవు.

7 /7

మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా హిందీలో అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ‘రెయిడ్’ మూవీకి రీమేక్. కానీ హరీష్ శంకర్ ఈ సినిమాను పూర్తిగా మార్పుల చేర్పులతో ఈ సినిమాను తెరకెక్కించాడు. మొత్తంగా ఈ సినిమాతో భాగ్యశ్రీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.