ఇంటర్నెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఏదో ఒక కొత్త మెస్సెజింగ్ యాప్, వీడియో షేరింగ్ యాప్స్ వస్తూనే ఉన్నాయి. డాక్యుమెంట్స్, ఫొటోలు సైతం షేర్ చేసుకోవడంతో పాటు వీడియో కాల్స్ స్థాయికి టెక్నాలజీ ఎదిగింది. ఇందులో భాగంగా వచ్చిన ఫేమస్ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp).
ఇంటర్నెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నిత్యం ఏదో ఒక కొత్త మెస్సెజింగ్ యాప్, వీడియో షేరింగ్ యాప్స్ వస్తూనే ఉన్నాయి. డాక్యుమెంట్స్, ఫొటోలు సైతం షేర్ చేసుకోవడంతో పాటు వీడియో కాల్స్ స్థాయికి టెక్నాలజీ ఎదిగింది. ఇందులో భాగంగా వచ్చిన ఫేమస్ మెస్సెజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp).
ఫేమస్ చాటింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఈ ఏడాది ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. కుప్పలుతెప్పలుగా వస్తున్న మెస్సెజ్‌లు, ఫైల్స్‌తో సమస్యల్ని అధిగమించేందుకు మెస్సెజ్ డిస్‌అప్పియర్ ఫీచర్‌ను తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. దాంతో మరింత సమర్థవంతంగా ముందుకు సాగుతోంది మెస్సెజింగ్ యాప్ వాట్సాప్.
మీకు వచ్చే వందలు, వేల మెస్సేజ్‌లు, ఫైల్స్‌తో ఫోన్ స్టోరేజీపై భారం పడుతుంది. తద్వారా తక్కువ స్టోరేజ్ ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో వాట్సాప్ డిస్‌అప్పియరింగ్ మెస్సెజెస్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఓఎస్ కస్టమర్లకు సైతం అందుబాటులోకి తెచ్చింది. ఈ వాట్సాప్ ఫీచర్‌ను ఆన్ చేస్తే చాలు భారీగా వస్తున్నా.. కేవలం చివరి వారం రోజుల మెస్సెజ్‌లు మాత్రమే మనకు కనిపిస్తాయి. Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
మీకు ఎక్కువగా మెస్సెజ్‌లు వచ్చే ఏదైనా ఒక ఛాట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత కాంటాక్ట్ పేరు మీద క్లిక్ చేయాలి. వెంటనే మీకు Disappearing Messages ఫీచర్ కనిపిస్తుంది. అక్కడ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు. ఆ ఛాట్‌లో మీరు పొందే సందేశాలు, ఫైల్స్ వారం రోజుల తర్వాత మాయం అవుతాయి. Also Read : WhatsApp Amazing Features: ఈ వాట్సాప్ ఫీచర్స్‌ను మీరు ట్రై చేశారా!
అయితే మీకు వచ్చిన వీడియోలు, ఫొటోలు డిలీట్ కావొద్దని మీరు భావిస్తే.. ఆటో డౌన్‌లోడ్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. తద్వారా మీ ఫోన్‌కు వచ్చే ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ ఉన్నట్టయితే ఆటోమేటిక్‌గా డౌన్‌లోన్ అవుతాయి. సందేశాలు మాత్రం కేవలం చివరి వారం రోజులవి మాత్రమే కనిపిస్తాయి. Also Read: Motor Vehicle New Rules: వాహనదారులు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్ ఇవే!