BSNL 150 Days Offer: ఇటీవలె పెరిగిన టెలికాం కంపెనీల భారీ ధరల నేపథ్యంలో వినియోగదారులు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండే ప్లాన్లకు పోర్ట్ అవుతున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే జూలై మాసంలో అధిక సంఖ్యంలో మొబైల్ యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆకర్షణీయమైన రీఛార్జీ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటుంది బీఎస్‌ఎన్‌ఎల్ ఈరోజు 150 రోజుల ప్లాన్ ఎంత తక్కువలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం.
ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ 4 జీ సర్వీసులను కూడా ప్రారంభించింది. అంతేకాదు అదనంగా మరో 25 వేల కొత్త 4G టవర్లను కూడా ప్రారంభించనుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్ఎల్ జియో, ఎయిర్‌టెల్ వీఐ కంటే కూడా తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులో ఉన్నాయి.
అయితే బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 397 తో రీచార్జీ చేసుకుంటే ఐదు నెలల వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే ఇది 150 రోజులు,అయితే మీరు కూడా సెకండ్ నంబర్ బీఎస్‌ఎన్‌ఎల్‌గా ఎంచుకుంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్.
రూ. 397 రీఛార్జ్ ప్లాన్ 150 రోజులు ఉచిత కాలింగ్ పొందుతారు. మొదటి నెల దేశవ్యాప్తంగా ఉండే అన్ని మొబైల్స్ కు ఉచిత కాలింగ్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. అంతేకాదు దేశవ్యాప్తంగా రోమింగ్ కూడా ఫ్రీగా పొందవచ్చు. ఈ నెల రోజుల తర్వాత అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకునేందుకు టాప్ అప్ చేయించుకోవాలి. కానీ, ఇన్ కమింగ్ కాల్స్ మాత్రం ఈ 150 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
ఈ 30 రోజులు మీరు 40 kbps స్పీడ్ 2 జీబీ డేటా కూడా పొందుతారు. ఇందులో అదనంగా ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా నెల రోజులపాటు పొందుతారు.
మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) అయిన ప్రభుత్వం రంగ సంస్థ ఢిల్లీ, ముంబైలో సేవలను అందిస్తుంది. ఇది బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. యూజర్ల అదనపు లాభాలు పొందుతారు.