AP: దీపావళి కానుక వారి ఖాతాల్లో రూ.3000 జమా.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

AP Nirudyoga bruthi: ఏపీ సర్కార్‌ పండుగ రోజు శుభవార్త చెప్పింది. ఒక్కో పథకాన్ని అమలు చేస్తోన్న చంద్రన్న ప్రభుత్వం. తాజాగా మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వారి ఖాతాల్లో ఇక ప్రతినెలా రూ.3000 జమా చేయాలని ఉత్తర్వులు సైతం జారీ చేసింది.
 

1 /6

పండుగ ముందు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేస్తోంది.  

2 /6

ఈ నేపథ్యంలో ఏడాదికి మూడు ఉచిత సిలిండర్‌లను ఈ దీపావళి పండుగ నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తోంది.   

3 /6

రాష్ట్రంలో ఉన్న వేద పండితులకు నెలకు నిరుద్యోగ భృతి కింద రూ.3000 చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో వేద పండితులకు పండుగ ముందు తీపి కబురు అందినట్లయింది.  

4 /6

ఈ వేద పండితులకు శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, కాణిపాకం వంటి ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని చెప్పింది. అయితే, ఈ సాయం పొందే పండితులు వారి ఇళ్ల దగ్గరలో ఉన్న ఆలయంలో ప్రతిరోజూ ఓ గంటపాటు వేద పారాయణం కూడా చేయాలని చెప్పింది.  

5 /6

ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిరుద్యోగ భృతిని అందిస్తోంది. ఇటీవలె రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులను కూడా స్వీకరించింది. వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు ఈ సాయం అందనుంది.  

6 /6

ఈ సాయం పొందడానికి కావాలసిన పత్రాలు ముఖ్యంగా ఆధార్‌ కార్డు, వేద విద్య అభ్యసించిన పత్రాలు, తాము ఏ ఇతర పనులు చేయడం లేదని ధ్రువపత్రం కలిగి ఉండాలి. వీరి ఖాతాల్లో ప్రతినెలా రూ.3000 జమా అవుతుంది.