Gold Rate Update 03 May 2021: బులియన్ మార్కెట్లో ఇటీవల బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి గత వారం ధరలకే మార్కెట్ అవుతోంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
Gold Price Today 03 May 2021: బులియన్ మార్కెట్లో ఇటీవల బంగారం ధరలు దిగొచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనిస్తూ పాత ధరలకే విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి గత వారం ధరలకే మార్కెట్ అవుతోంది. నేటి బంగారం, వెండి ధరలు మీకోసం..
Gold Price Today In Hyderabad: తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,780గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,800 వద్ద మార్కెట్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా మార్కెట్ అవుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.49,570 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,370 గా విక్రయాలు జరుగుతున్నాయి.
బులియన్ మార్కెట్లో వారాంతంలో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.67,500 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలో తాజాగా ఏ మార్పు లేదు. నేడు హైదరాబాద్ మార్కెట్లో వెండి 1 కేజీ ధర రూ.72,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.