Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటించారు. ఈ సినిమాను దివంగత శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
Ram Charan: ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతుంది. డిసెంబర్ 21న యు.ఎస్‌లోని డల్లాస్‌లో గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవల్లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో అభిమానులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో రామ్ చరణ్, దిల్ రాజు, శిరీష్, చరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి తదితరులు పార్టిసిపేట్ చేశారు.
ఈ సందర్భంగా గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. అమెరికాలోని డల్లాస్‌లోని ఫ్యాన్స్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పారు. ఇక్కడి వారి చూపించిన ప్రేమాభిమానాలతో మాటలు అర్ధం కావడం లేదు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్న తీరు చూసి ఆశ్చర్యపోయాను. నేను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నానా లేక డల్లాస్ కు వచ్చామా అనే ఆశ్యర్యం కలుగుతుందని కూడా అర్థం కావటం లేదన్నారు.
లవ్ యు ఆల్ అంటూ చెప్పుకొచ్చారు. నాపై ఉన్న ప్రేమతో ఇక్కడకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాను ముందుగా ఓవర్‌సీస్‌లోని ప్రజలే ముందుగా సినిమాను చూస్తారు. ఇక్కడ నుంచే ప్రమోషన్స్‌ను మొదలు పెడుతున్నామన్నారు.
మా ‘గేమ్ చేంజర్’కు మీ అందరి ఆశీస్సులు మాకు కావాలన్నారు. ఈ సందర్భంగా దిల్‌రాజుకి, శిరీష్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఇంత పెద్ద ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించిన రాజేష్ కల్లెపల్లి అండ్ టీమ్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. జనవరి 10న రిలీజ్ అవుతోన్న ‘గేమ్ ఛేంజర్’ను చూసి ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు మాట్లాడుతూ..‘గేమ్ చేంజర్’ టైటిల్‌ను పెట్టినప్పుడే సరికొత్తగా ప్రమోషన్స్ చేయాలని ముందుగా డిసైడ్ అయ్యాము. అందులో భాగంగా డల్లాస్‌ను సెలక్ట్ చేసుకున్నామన్నారు. యు.ఎస్‌లో ఇంత భారీగా ఓ తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించటం అనేది ఇదే ఫస్ట్ టైమ్.
టైటిల్‌కు తగ్గట్లే ఈవెంట్‌ను చేయాలని చేశామన్నారు. దానికి రాజేష్, ముందుకొచ్చి సపోర్ట్ చేశారు. గ్లోబల్ స్టార్ గేమ్ ఛేంజర్ అన్‌ప్రిడెక్టబుల్ అని కొనియాడారు.
ఓ వైపు అభిమానులు.. మరోవైపు సినీ ప్రేక్షకులు గేమ్ చేంజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పవర్‌ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజ్ స్టోరీని అందించారు.
ఎస్.యు.వెంకటేశన్, వివేక్ రైటర్స్‌గా పని చేశారు. హర్షిత్ సహ నిర్మాత. ఎస్.తిరుణ్ణావుక్కరసు సినిమాటోగ్రఫీ, ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. నరసింహా రావు.ఎన్, ఎస్.కె.జబీర్ లైన్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఆర్ట్ డైరెక్టర్‌గా అవినాష్ కొల్ల, యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా అన్బరివు, డాన్స్ డైరెక్టర్‌గా ప్రభుదేవా, గణేష్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ వర్క్ చేస్తున్నారు. రామ్ జోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. సరిగమ ద్వారా గేమ్ చేంజర్ ఆడియో రిలీజ్ అవుతోంది. నార్త్ అమెరికాలో గేమ్ చేంజర్ చిత్రాన్ని శ్లోకా ఎంటర్టైన్మెంట్స్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది.