New year celebrations 2025: కొత్త సంవత్సరం వేళ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్నిరోజులుగా సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ స్వాపింగ్ రాకెట్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా.. క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకల్లో జనాలు మునిగితెలుతున్నారు. ఇప్పటి నుంచి కొత్త ఏడాదికి ఏ విధంగా స్వాగతం పలకాలో రకరకాల ప్లాన్ లు వేస్తున్నారు.
కొందరు తమ స్నేహితులతో పార్టీలకు ప్లాన్ లు చేస్తుంటే.. మరికొందరు ఫ్యామిలీతో న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులో స్వాపింగ్ పేరిట కొంత మంది వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారంట. ఇది పెద్ద రాకెట్ ల సీక్రెట్ గా జరుగుతుందంట. దీనిపైన నిఘా పెట్టిన బెంగళూరు పోలీసులు తాజాగా, ఇద్దర్ని అరెస్ట్ చేశారంట. మరికొందర్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారంట.
అసలు.. ఈ ఫారెన్ కల్చర్ పేరిట యువత చెడిపోతున్నారని కూడా చాలా మంది ఆందోళన చెందుతున్నారంట. తమతో యువతుల్ని పబ్ లకు తీసుకెళ్లి.. అక్కడ ఇతరుల గర్ల్ ఫ్రెండ్ తో సంభోగంలో పాల్గొంటారంట. ఈ కల్చర్ కు ఎవరైన నో చెప్పితే.. వారిపై దాడులు కూడా చేస్తున్నారంట.
న్యూ ఇయర్ కు ముందు ఈ ఘటన వెలుగు చూడటంతో పోలీసులు కూడా ఖంగుతిన్నారంట. ప్రస్తుతం ప్రత్యేకంగా పోలీసులు.. ఇలాంటి ఘటనలపై సీరియస్ గా గాలింపు చేపట్టారంట. పలువురిపై కేసుల్ని సైతం నమోదు చేశారంట. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.