Ghee Side Effects: ఈ నలుగురు పొరపాటున కూడా నెయ్యి తినకూడదు.. లేదంటే ఇక అంతే సంగతులు..

Ghee Side Effects: నెయ్యి ఆరోగ్యకరమని నిపుణులు చెబుతుంటారు. మనం తయారు చేసుకునే రెసిపీలో నేను కచ్చితంగా యాడ్ చేసుకుంటాం. ముఖ్యంగా స్వీట్ రెసిపీలో నెయ్యిని ఉపయోగిస్తారు. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు కూడా చెబుతుంటారు. ఎందుకంటే నెయ్యిలో మన ఖనిజాలు అంటే ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
 

1 /5

నెయ్యితో ఆరోగ్యం బాగుంటుంది కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దీన్ని తీసుకోవడం వల్ల మన శరీరానికి కొన్ని విటమిన్స్, మినరల్స్‌ గ్రహించబడతాయి. నెయ్యి కలిపి మనం కూరగాయలు వండుకోవటం వల్ల కూడా అందులోని ఖనిజాలు సులభంగా గ్రహించగలుగుతుంది. ఇదిలా ఉంటే కానీ కొన్ని నాలుగు సమస్యలు ఉన్నవారు కచ్చితంగా నెయ్యి తినకూడదు అంట ఒకవేళ పొరపాటున నెయ్యి తీసుకోవడం వల్ల వారు ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారుతుంది.  

2 /5

లాక్టోజ్‌.. లాక్టోజ్ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చేవారు నెయ్యి తీసుకోకపోవటమే మేలు. వీరికి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. ఇందులో లాక్టోజ్ తక్కువ పరిమాణంలోనే ఉన్న కానీ ఈ సమస్య ఉన్నవారు తీసుకోవటం వల్ల తీవ్ర కడుపునొప్పి సమస్యలకు దారితీస్తుంది. దీంతో వాళ్లకు కడుపులో అజీర్తి డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

3 /5

గుండె సమస్యలు..  అంతేకాదు నెయ్యిని గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు కూడా తీసుకోకపోవడమే మేలు. ఎందుకంటే నెయ్యిలో కొలెస్ట్రాల్ స్థాయిలో అధికంగా ఉంటాయి. నేను తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత పాడవుతుంది. అంతేకాదు హై కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా నెయ్యి తీసుకోకూడదు.

4 /5

ఒబెసిటీ.. ఒబెసిటీ ఉన్నవారు కూడా నెయ్యి తీసుకోకుండా ఉండటమే మేలు. ఎందుకంటే డైట్ లో ఉన్నవారు కూడా నెయ్యి తీసుకోవటం మానుకోవడమే మేలు ఇందులో క్యాలరీలు ఉంటాయి. ఒకవేళ మీరు అధికంగా తింటే డైట్ మారిపోతుంది. దీంతో బరువు పెరుగుతారు గుండె సంబంధిత సమస్యలు కూడా దారితీస్తుంది.

5 /5

అలర్జీ.. కొంతమందికి కొన్ని పదార్థాలు అలర్జీలకు దారి తీస్తాయి. అలాంటివారు ఏ కొత్తరకం ఆహార పదార్థాలను కూడా ట్రై చేయాలంటే ముందు వెనక ఆలోచించాలి. అంతేకాదు ఇలాంటి వారు కూడా నెయ్యి తీసుకోకపోవడమే మేలు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)