FD Rates and Banks: ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ చెల్లించే టాప్ 5 బ్యాంకులివే

చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యధిక రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిటైర్మెంట్ తరువాత చాలామంది ఆ డబ్బుల్ని ఎఫ్‌డి చేస్తుంటారు. అయితే ఎఫ్‌డీ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కో వడ్డీ ఆఫర్ చేస్తుంటుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం..

FD Rates and Banks: చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యధిక రిటర్న్స్ ఇవ్వడమే కాకుండా రిస్క్ ఏ మాత్రం ఉండదు. అందుకే రిటైర్మెంట్ తరువాత చాలామంది ఆ డబ్బుల్ని ఎఫ్‌డి చేస్తుంటారు. అయితే ఎఫ్‌డీ విషయంలో ఒక్కొక్క బ్యాంకు ఒక్కో వడ్డీ ఆఫర్ చేస్తుంటుంది. అత్యధిక వడ్డీ ఇచ్చే టాప్ 5 బ్యాంకులేవో తెలుసుకుందాం..

1 /5

ఎస్బీఐ ఎఫ్‌డి వడ్డీ రేట్లు ఎస్బీఐ ఎఫ్‌డీపై 3.5 నుంచి 7.25 శాతం వరకూ వడ్డీ ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం చెల్లిస్తుంది. 400 రోజుల అమృత్ కలశ్ ఎఫ్‌డిపై ఎస్బీఐ 7.10 శాతం వడ్డీ ఇస్తోంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 7.60 శాతం వడ్డీ చెల్లిస్తోంది. ఇది కాకుండా 444 రోజు అమృత్ వర్ష స్కీమ్‌లో 7.25 శాతం వడ్డీ అందిస్తోంది.

2 /5

పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు ఉంది. సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతముంది. అత్యధికంగా వడ్డీ 400 రోజుల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై ఇస్తోంది. 

3 /5

ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 7.25 వరకూ వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు అయితే 3.5 శాతం నుంచి 7.8 శాతం వరకూ చెల్లిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు అందించే అత్యధిక వడ్డీ 7.25 శాతం నుంచి 7.8 శాతం వరకూ ఉంది. ఇది 15 నెలల నుంచి 18 నెలల కాల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై.

4 /5

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3 శాతం నుంచి 7.4 శాతం వడ్డీ అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం నుంచి 7.9 శాతం వరకూ చెల్లిస్తోంది. ఈ బ్యాంకు అత్యదిక వడ్డీ ఇచ్చేది 4.7 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై.

5 /5

కెనరా బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేట్లు కెనరా బ్యాంకు అత్యధికంగా 444 రోజుల ఎఫ్‌డీకు వడ్డీ చెల్లిస్తోంది. ఇందులో 4 శాతం నుంచి 7.25 శాతం వరకూ వడ్డీ ఉంది. 7-10 రోజుల కాల వ్వవధి కలిగిన ఎఫ్‌డీలపై. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 7.75 శాతం వరకూ ఉంది.