Keerthy suresh comments: నటి కీర్తిసురేష్ గత ఏడాది తన చిన్న నాటి మిత్రుడు ఆంటోనీ తట్టిల్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన వైవాహిక జీవితంపై కీర్తిసురేష్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
కీర్తిసురేష్ పెళ్లి గత ఏడాది డిసెంబర్ 12న గోవాలో గ్రాండ్ గా జరిగింది. హిందు,క్రిస్టియన్ సంప్రదాయ పద్దతిలో కీర్తిసురేష్, ఆంటోనీ తట్టిల్ ల పెళ్లి జరిగింది. వీరి పెళ్లి కొద్ది మంది అతిథులు, స్నేహితుల మధ్య వైభవంగా జరిగింది.
పెళ్లి తర్వాత కూడా కీర్తిసురేష్ రెండు రోజుల్లోనే పసుపు మంగళ సూత్రంలో బేబీజాన్ మూవీ ప్రమోషన్స్ లో మెరిశారు. ఈ ముద్దు గుమ్మ పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం తగ్గెదేలా అన్న విధంగా క్యూట్ గా అందాలు ఆరబోస్తు అభిమానుల్ని ఫిదా చేసింది.
అయితే.. కీర్తి సురేష్ బేబీజాన్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సమంత తమిళంలో చేసిన తేరీ మూవీరి బేబీజాన్ రీమేక్.. ఈ మూవీలో కీర్తిసురేష్ ను సామ్ ప్రపోజ్ చేసింది. ఇటీవల కీర్తిసురేష్ సామ్.. తన సోదరి అంటూ ప్రశంసలు సైతం కురిపించారు.
కీర్తి సురేష్ పెళ్లి తర్తాత తన వైవాహిక జీవతంలో చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. పెళ్లి తర్వాత కూడా తన భర్త ఆంటోనీ తట్టిల్ చాలా విషయాల్లో ఫ్రీడమ్ ఇచ్చాడన్నారు.
తనకు పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఒకేలా ఉందన్నారు. అయితే.. ఎక్కడికైనతాము వెళ్లినప్పుడు.. ఫోటోలు, సెల్ఫీల కోసం అభిమానులు చుట్టుముడుతున్నారని, దీని వల్ల ఆంటోనీ తట్టిల్ కాస్తంత ఇబ్బంది పడుతున్నాడని అన్నారు. తనకు సిగ్గు ఎక్కువ అని చెప్పుకొచ్చారు.
ఆంటోనీ తట్టిల్ సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండడని.. నేను మాత్రం.. ఎక్కడికి వెళ్లిన ఫోటోలు, రీల్స్ చేస్తుంటానని.. ఈ విషయంలో తన భర్తపై నాదే డామినేషన్ అంటూ కీర్తిసురేష్ ఫన్నీగా మాట్లాడారు. మా ఆయన బంగారం అని, తన పెళ్లి లైఫ్ చాలా బాగుందని కూడా కీర్తిసురేష్ కామెంట్స్ చేశారు. ఇటీవల కీర్తి సురేష్ తొలి సంక్రాంతి ఫెస్టివల్ ను కూడా చేసుకున్నారు.