PM Kisan Yojana: దసరా ముందు రైతులకు కేంద్రం భారీ శుభవార్త.. నేడు రూ.2000 ఖాతాల్లో జమా..

PM Kisan Yojana 18 th Installment: దసరా పండుగకు ముందు రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. నేడు కిసాన్‌ సమృద్ధి యోజన 18వ విడుత డబ్బులను వారి ఖాతాల్లో జమా చేయనుంది. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాల్లో పండుగకు ముందే రూ.2000 అందనున్నాయి.
 

1 /5

PM Kisan Yojana 18 th Installment: ప్రతి ఏడాదికి మూడు సార్లు రైతుల సంక్షేమం కోసం రూ. 2000 డబ్బులను జమా చేస్తుంది కేంద్రం. ఈ నేపథ్యంలో 18వ విడత డబ్బులు ఈ రోజు అక్టోబర్‌ 5వ తేదీ రైతుల ఖాతాల్లో జమా కానున్నాయి. జూన్‌ నెలలో 17వ విడత డబ్బులను విడుదల చేసింది కేంద్రం.  

2 /5

ఏడాదికి మూడు విడతల్లో కేంద్రం డీబీటీ ద్వారా రూ.2000 జమా చేస్తారు. ఆర్థికంగా చిన్న సన్నకారు రైతులను ఆదుకోవడానికి మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.  

3 /5

ప్రధాని మోడీ చేతుల మీదుగా నేడు రైతుల ఖాతాల్లో డీబీటీ ద్వారా ఈ డబ్బులు జమా కానున్నాయి. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.4 కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. దీనికి కేంద్రం రూ.20 వేల కోట్లను ఖర్చుచేయనుంది.  

4 /5

పీఎం కిసాన్‌ యోజన ద్వారా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు విడతల్లో రూ.2000 జమా చేస్తోంది. దీంతో ఏడాదికి రైతుల ఖాతాల్లో కేంద్రం తరఫున రూ.6,000 సహాయం అందుతుంది. నేరుగా అన్నదాతల ఖాతాల్లో ఈ డబ్బులు డిపాజిట్‌ అవుతాయి.  

5 /5

ఇదిలా ఉండగా జమ్మూ, కశ్మీర్‌లో ఉండే రైతులకు మాత్రం రూ.10,000 ఏడాదికి జమా చేయనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాగంగా కేంద్రం ఈ మేరకు హామీ ఇచ్చింది. జమ్మూ కశ్మీర్‌లో ఉన్న రైతులకు రూ.3,000 ఏడాదికి రెండుసార్లు, రూ.4000 ఒక్కసారి మొత్తం రూ.10,000 జమా చేయనుంది.