వర్షాకాలం కావడంతో అప్పుడే డెంగ్యూ ముప్పు కూడా పెరిగిపోయింది. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. డెంగ్యూ సోకితే శరీరంలో Platelet సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా Platelet సంఖ్య పెంచుకోవాలి. ఈ 5 ఫ్రూట్స్ తీసుకుంటే Platelet సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
Platelets Increase Fruits: వర్షాకాలం కావడంతో అప్పుడే డెంగ్యూ ముప్పు కూడా పెరిగిపోయింది. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. డెంగ్యూ సోకితే శరీరంలో Platelet సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా Platelet సంఖ్య పెంచుకోవాలి. ఈ 5 ఫ్రూట్స్ తీసుకుంటే Platelet సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
కివీ కివీలో కాపర్, పొటాషియం, విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తి, ఇమ్యూనిటీ పెంచడంలో, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెస్స్ కోసం ఉపయోగపడతాయి.
బొప్పాయి బొప్పాయి అనేది Platelet సంఖ్య పెంచేందుకు అనాదిగా వాడుకలో ఉన్న అద్భుతమైన వైద్య విధానం. ఇందులో ఉండే పపైన్ అనే ఎంజైమ్ డెంగ్యూతో పోరాడే శక్తిని అందిస్తుంది. Platelet సంఖ్యను పెంచుతుంది.
బత్తాయి బత్తాయిలో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో , Platelet సంఖ్య పెంచడంలో ఉపయోగపడుతుంది.
దానిమ్మ దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో డెంగ్యూ వ్యాధి నివారణకు దోహదపడతాయి. రక్తపోటును అదుపు చేసి Platelet సంఖ్య పెంచుతుంది
కొబ్బరి నీళ్లు ఇక ప్రకృతిలో విరివిగా లభించే అద్భుతమైన అమృతం కొబ్బరి నీళ్లు. శరీరానికి అవసరమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందిస్తుంది. డెంగ్యూలో ఏర్పడే డీ హైడ్రేషన్ సమస్య నుంచి కాపాడుతుంది.