Darken Gray Hair with coconut oil: తెల్ల జుట్టు సమస్య తగ్గించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, నేచురల్‌గా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనికి అవకాడోను వాడండి. దీంతో మీ జుట్టుకు పోషకాలు, ఖనిజాలు అంది నేచురల్‌గా నలుపు రంగులోకి మారిపోతుంది. అంతేకాదు జుట్టుకు ఇది హైడ్రేషన్ కూడా అందిస్తుంది.
అవకాడో జుట్టుకు మూలాల నుంచి మంచి పోషణ అందిస్తుంది. కొబ్బరినూనెలో అవకాడో పేస్ట్ వేసి కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇది ప్రోటీన్ లేమిని సరిచేసి జుట్టుకు మంచి పోషణ అందిస్తుంది. దీంతో మీ జుట్టు మూలాల నుంచి బలంగా మారుతుంది.
అవకాడోలో ఉండే లారిక్ యాసిడ్ జుట్టు చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరినూనె అవకాడో రెండూ కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. స్ల్పిట్ ఎండ్ సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.
పండిన అవకాడో తీసుకుని జుట్టుకు హెయిర్ మాస్క్ వేసుకోవాలి. కొబ్బరి నూనెలో అవకాడో మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి. దీన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. ఇందులో మీకు సువాసన రావాలంటే రోజ్మేరీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు.
జుట్టుకు ఈ మాస్క్ ఉపయోగించడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు అంతటికీ పట్టించిన తర్వాత ఓ అరగంటకు తలస్నానం చేయాలి. ముఖ్యంగా అవకాడో ఉండే ఫ్యాటీ యాసిడ్, ఒలీక్ యాసిడ్ హెయిర్ ఫోలిక్ డ్యామేజ్ కాకుండా కాపాడతాయి.అంతేకాదు అవకాడోలో విటమిన్ ఏ, బీ, డీ, ఇ కూడా ఉంటాయి.
అవకాడో జుట్టు పోషణ అందిస్తుంది. బలహీనంగా ఉన్న జుట్టుకు జీవాన్ని కూడా అందిస్తుంది. తెల్లజుట్టు సమస్యకు చెక్ పెడుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)