Heroine Love: ఎయిర్‌పోర్ట్‌లో ముఖ్యమంత్రి కొడుకుకు కన్ను కొట్టిన స్టార్‌ హీరోయిన్‌

Genelia DSouza Riteish Deshmukh Crazy Love Story: భారత సినీ పరిశ్రమలో రితేశ్‌ దేశ్‌ముఖ్‌, జెనీలియా అందమైన జంట. ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రేమ కథ చాలా విచిత్రంగా ఉంది. వీరిద్దరి తొలి పరిచయం ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. అయితే రితేశ్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు అనే విషయం తెలియదంట.

1 /11

పెళ్లయి 21 ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా కొనసాగుతున్న జంట జెనీలియా డిసౌజ, రితేశ్ దేశ్ ముఖ్

2 /11

బాలీవుడ్‌లో అందమైన జోడీ రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

3 /11

పెళ్లయి రెండు దశాబ్దాలు అవుతున్నా వీరు అన్యోన్యంగా ఉంటూ వివాహ బంధాన్ని మరింత పెంచుకుంటున్నారు.

4 /11

వీరి ప్రేమ కథ సినిమా కథను మించి ఉంది. ఒక ముఖ్యమంత్రి కుమారుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు.

5 /11

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో రితేష్ కనిపిస్తే జెనీలియా పట్టించుకోలేదంట. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావు కుమారుడు రితేశ్‌ కావడంతో అంతగా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని రితేష్ దేశ్‌ముఖ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

6 /11

జెనీలియా, రితేశ్‌ తొలిసారి హైదరాబాద్‌లోనే కలుసుకున్నారు. అది 'తుజే మేరీ కసమ్' సినిమాకు సంబంధించిన టెస్ట్ షూట్‌లో కలుసుకోవడం విశేషం.

7 /11

'తుజే మేరీ కసమ్' సెట్స్‌లో జెనీలియా, రితేశ్‌ పరిచయమై స్నేహితులుగా కొనసాగారు. హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత రితీష్ జెనీలియాను చాలా మిస్ అయినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

8 /11

మళ్లీ ‘మస్తీ’ చిత్రంలో జెనీలియా, రితేశ్‌ కలిసి నటించారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 

9 /11

కొన్నాళ్లు ఇద్దరూ ప్రేమలో మునిగి తేలారు. కొన్నాళ్లకు పెళ్లి చేసుకోవాలనుకుని నిశ్చయించుకోగా రితేశ్‌ తండ్రి విలాస్‌ రావు మాత్రం ఈ పెళ్లిని ఇష్టపడలేదంట. 

10 /11

రితేశ్‌కి జెనీలియా అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో జెనీలియాకు బెదిరింపులు వచ్చాయి. అయినా పట్టు వదలకుండా ఎన్నో ప్రయత్నాల తర్వాత విలాసరావుకు వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించారు. 

11 /11

కుటుంబసభ్యుల అంగీకారంతో 2012 ఫిబ్రవరి 3వ తేదీన జెనీలియా, రితీష్ దేశ్‌ముఖ్ అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కొడుకులు రియాన్‌, రాహిల్‌.