Sleeplessness impact in Telugu: ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరికీ నిద్ర సమస్య వెంటాడుతోంది. బిజీ లైఫ్ కారణంగా నిద్రపోయే సమయం ఉండటం లేదు. లేదా సుఖమైన 7-8 గంటల నిద్రకు నోచుకోవడం లేదు. ఆలస్యంగా పడుకోవడం, త్వరగా లేవడం వల్ల నిద్ర చాలటం లేదు. అందుకే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.
Sleeplessness impact in Telugu: ప్రాణాంతకమైన డయాబెటిస్, హార్ట్ ఎటాక్, కొలెస్ట్రాల్ ఇలా అన్ని వ్యాధులకు కారణం ఇదే. రోజూ తగినంత నిద్ర లేకపోతే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంటుంది. అందుకే నిద్ర విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి.
ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరం రాత్రి నిద్రపోయే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ స్మార్ట్ఫోన్, ట్యాబ్ లేదా టీవీ చూడకూడదు. నిద్రపోవడానికి కనీసం గంట ముందు వీటిని కట్టేయాలి. మీరు నిద్రించే గది లేదా బెడ్ శుభ్రంగా ఉండాలి.
సుఖమైన నిద్రకు ఏం చేయాలి మంచి సుఖమైన నిద్ర కావాలంటే రాత్రి నిద్రించేందుకు ఓ నిర్ణీత సమయం ఫిక్స్ చేసుకోండి. రాత్రి 10 గంటలకు నిద్రపోతే ఉదయం 6 గంటలకు లేవాలి. అంటే 8 గంటలు నిద్ర ఉంటుంది. లేదా రాత్రి 9 గంటలకు నిద్రపోతే ఉదయం 5 గంటలకు లేవాలి. ఒక గంట అటూ ఇటూ అయితే ఫరవాలేదు
ఏకాగ్రత లోపించడం విద్యార్ధులకైతే ఇది మరింత ప్రమాదం. నిద్ర సరిపడినంత లేకపోతే మానసిక సామర్ధ్యంపై ప్రభావం పడుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది.
హార్ట్ ఎటాక్, స్ఠూలకాయం ఇప్పటి నిద్రలేమి ప్రభావంపై చాలా అధ్యయనాలు ఉన్నాయి. వీటి ప్రకారం నిద్ర పూర్తిగా లేకపోతే హార్ట్ ఎటాక్, మధుమేహం, స్థూలకాయం సమస్య ఉత్పన్నమౌతుంది. ఈ వ్యాధులు ప్రాణాంతక వ్యాధులు. అంతేకాకుండా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల రోజువారీ పనులపై కూడా ప్రతికూల ప్రబావం పడుతుంది
మెదడుపై ప్రభావం ఆలస్యంగా నిద్రపోవడం వల్ల వ్యక్తి మానసిక స్థితిపై ప్రభావం కన్పిస్తుంది. మానసిక ఆందోళన లేదా ఒత్తిడి ఉంటుంది. ఏకాగ్రత లోపించవచ్చు. ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోతారు. మొత్తానికి మానసిక ఆరోగ్యం వికటిస్తుంది
ఆరోగ్యపరంగా నష్టాలు కారణాలు ఏమైనా రాత్రి ఆలస్యంగా నిద్రించడం అలవాటుగా మారిపోయింది. దీనివల్ల పలు గంభీరమైన వ్యాధులకు ఎదురుకావచ్చు. ఈ వ్యాధుల్నించి ఎలా కాపాడుకోవాలి, ఆలస్యంగా నిద్రించడం వల్ల లేదా నిద్ర సరిపోకపోవడం వల్ల కలిగి నష్టాలేంటి..ఆ వివరాలు మీ కోసం.