Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. దసరాకు ముందే రైతులకు ఈ అతి భారీ ప్రకటనతో భారీ మేలు చేకూరనుంది. దీంతో వారు పండుగకు ముందే తీపి కబురును అందుకున్నారు.. ఆ వివరాలు తెలుసుకుందాం.
మొన్నటి వరకు సన్న వడ్లకు బోనస్ రూ.500 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తెలంగాణ రైతులకు అందించింది. దసరాకు ముందే వారికి తీపి కబురు అందినట్లయింది.
పామాయిల్ మద్ధతు ధర రూ.17,043 గెలల ధర పెరిగింది. తెలంగాణ రైతులకు లాభసాటిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దసరాకు ముందే వచ్చిందని అన్నారు. కొత్తరైతులను కూడా ప్రోత్సహించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్ దిగుమతి సుంకం కూడా 5.5 నుంచి 27.5 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి గుర్తుచేశారు.
ఇటీవలె సన్నవడ్లకు కూడా రూ.500 బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. మంత్రి వర్గం కూడా ఆమోదం తెలిపింది. రైతు భరోసా డబ్బులను కూడా దసరాలోపు రైతుల ఖాతాలో జమా చేయాలని యోచిస్తుందట.
ఈ బోనస్ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లో ఖరీఫ్ సీజన్‌లోనే జమా చేయాలని ఆలోచిస్తుందట. ఈ సందర్భంగా 9,366 రైతులకు లబ్బి చేకూరుతుంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల వరద ప్రభావిత తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. వారు ఇలా దిగుమతి సుంకం పెంచినందుకు తుమ్మల ధన్యవాదాలు కూడా తెలిపారు.