Chia Seeds Benefits: చియా సీడ్స్ ఎందుకు తీసుకోవాలి, తింటే ఏమౌతుంది

ప్రకృతిలో లభించే వివిధ రకాల సీడ్స్‌లో చియా సీడ్స్ అద్భుతమైనవని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలలో నిండి ఉండే ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి

Chia Seeds Benefits: ప్రకృతిలో లభించే వివిధ రకాల సీడ్స్‌లో చియా సీడ్స్ అద్భుతమైనవని చెప్పాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలలో నిండి ఉండే ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి
 

1 /8

రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగుడుపున తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. 

2 /8

చియా సీడ్స్ త్వరగా జీర్ణమౌతాయి. అలాగని ఎక్కువసార్లు తీసుకోకూడదు. రోజుకు ఒకసారే తీసుకోవాలి. చియా సీడ్స్ నీళ్లలో కలిపి తాగాలి. నానబెట్టిన చియా సీడ్స్ తీసుకుంటే మంచిది. 

3 /8

జీర్ణక్రియ మెరుగుపర్చడం చియా సీడ్స్‌లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ప్రతి రోజూ గుప్పెడు చియా సీడ్స్ తీసుకుంటే ఇందులే ఉండే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

4 /8

డయాబెటిస్ ముప్పు  చియా సీడ్స్‌లో పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , ప్రోటీన్లు,  పుష్కంలగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ, అధిక బరువు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది

5 /8

షుగర్ కంట్రోల్ చియా సీడ్స్ క్రమం తప్పకుండా రోజూ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 

6 /8

గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ చియా సీడ్స్‌లో పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. దాంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి.  చియా సీడ్స్ సేవించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది

7 /8

ఎముకల పటిష్టత చియా సీడ్స్‌లో మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ాలా ప్రయోజనకరం. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పాస్పరస్ ఉంటాయి. 25 గ్రాముల చియా సీడ్స్ తీసుకుంటే అందులే 158 మిల్గీగ్రాముల కాల్షియం ఉంటుంది. 

8 /8

చియా సీడ్స్ ప్రయోజనాలు చియా సీడ్స్ పరిమాణంలో చిన్నవే అయితే ఊహించని ప్రయోజనాలు కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యం, ఎముకల పటిష్టత, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడం, మలబద్ధకం నివారించడం, ఇలా చాలా లాభాలున్నాయి.