Samantha: బిగ్ షాకింగ్.. సమంతకు మరో ఆరోగ్య సమస్య..!

Samantha health issue: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న సమంత, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం ఈమె..మరో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
 

1 /5

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన  గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలుసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో నాగచైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై,  భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి భారీ పాపులారిటీ అందుకుంది.

2 /5

ఇకపోతే మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్య తో ప్రేమలో పడి దాదాపు 7 ఏళ్ల ప్రేమాయణం తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె, మధ్యలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంది. అందులో భాగంగానే కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే శరీరం పై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు వచ్చేవని వైద్యులను సంప్రదించగా.. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారట.

3 /5

ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది సమంత. కొంతకాలం తర్వాత  సమస్య నయమయ్యింది కానీ ఆమెను మళ్ళీ మయోసైటిస్ అనే వ్యాధి వెంటాడింది. ఆ సమస్యను నయం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లిన ఈమె దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చు చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సమస్య నుంచి బయటపడడానికి దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి విరామం కూడా ఇచ్చింది.  

4 /5

ఇప్పుడు మరో సమస్యతో కూడా బాధపడుతోందట సమంత. మునుపటిలాగే ఇప్పుడు కూడా కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరం అలర్జీ బారిన పడుతోందని సమాచారం.  ఇప్పుడు ఇదే విషయంపై డాక్టర్ను సంప్రదించగా ఏది తిన్నా సరే చాలా కొద్ది మోతాదులో మాత్రమే తినాలి అని సూచించారట.  ఏది ఏమైనా సమంతాను ఆరోగ్య సమస్యలు ఒకటి తరువాత ఒకటి వెంటాడుతుంటే అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

5 /5

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రెట్టింపు వేగంతో దూసుకుపోవడానికి సిద్ధమవుతోంది. అందులో భాగంగానే తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సమంత.