High Profitable Small Business Idea: ఎవరికి తెలియని సీక్రెట్ బిజినెస్‌ ఐడియా.. నెలకు రూ. 2 లక్షల ఆదాయం.. డోంట్ మిస్!

Honeycomb Business Idea 2025: బిజినెస్ అనేది కేవలం లాభం సంపాదించే ఒక వ్యాపారం మాత్రమే కాదు. అది మన జీవితంలో మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. బిజినెస్ మనకు మార్కెట్‌ను, కస్టమర్లను, పోటీని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఎలా ఆలోచిస్తామో, ఎలా నిర్ణయాలు తీసుకుంటామో అనేది బిజినెస్ ద్వారా మరింత స్పష్టంగా తెలుస్తుంది. బిజినెస్ మన సొంత కలలను సాకారం చేసుకోవడానికి ఒక వేదికలాంటిది. మనం ఏమి చేయాలనుకుంటున్నాం, ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం అనేది బిజినెస్ ద్వారా నిజం చేసుకోవచ్చు. అయితే మీరు కూడా సొంతంగా బిజినెస్‌ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా?  ఈ అద్బుతమైన బిజినెస్ ఐడియా మీకోసం. 
 

1 /10

 ప్రస్తుతం చిన్న వ్యాపారాలకు మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వల్ల చిన్న వ్యాపారాలకు ప్రపంచ మార్కెట్‌ను చేరుకోవడం చాలా సులభమైంది. కస్టమర్లు ఇప్పుడు వ్యక్తిగతీకరించిన ఉత్పత్తులు, సేవలను కోరుకుంటున్నారు. చిన్న వ్యాపారాలు ఈ డిమాండ్‌ను తీర్చడానికి మరింత సౌకర్యంగా ఉంటాయి.

2 /10

స్థానికంగా తయారు చేసిన, స్థానికంగా కొనుగోలు చేసిన ఉత్పత్తులపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. చిన్న వ్యాపారాలు కొత్త ఆలోచనలు, నవీన పద్ధతులను అమలు చేయడానికి మరింత సులభంగా ఉంటాయి.

3 /10

మీరు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఈరోజు తెలుసుకొనే వ్యాపారం ఇంటి నుంచి లేదా చిన్న పొల్లం ఉన్నవారికి అద్భుతమైన లాభాలను తీసుకువస్తుంది. ఈ వ్యాపారంతో నెలకు రూ. 2 లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్‌ ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం.   

4 /10

తేనె వ్యాపారం అనేది ప్రాచీన కాలం నుంచి ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో ఆరోగ్య అవగాహన పెరగడంతో ఈ వ్యాపారం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. తేనె కేవలం ఒక తీపి పదార్థం మాత్రమే కాదు ఇందులో అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ కారణంగానే తేనెకు మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది.

5 /10

తేనెపట్టు వ్యాపారం అనేది ప్రకృతిని ఆధారంగా చేసుకొనే లాభదాయకమైన వ్యాపారం. పెరుగుతున్న ఆరోగ్య అవగాహనతో పాటు తేనెకు ఉన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.   

6 /10

ప్రస్తుతం మార్కెట్‌లో తేనెకు ఎక్కువ డిమాండ్‌ ఉంది. ఎందుకంటే తేనెను ఆహారంగా మాత్రమే కాకుండా ఔషధం, సౌందర్య సాధనాల తయారీలో కూడా విరివిగా వాడుతున్నారు. తేనెకు ఉన్న డిమాండ్ కారణంగా ఈ వ్యాపారం నుంచి అధిక లాభాలు పొందవచ్చు.  

7 /10

 తేనెపట్టు వ్యాపారం ప్రారంభించడానికి అధిక పెట్టుబడి అక్కరలేదు కేవలం తక్కువ పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్‌ ప్రారంభించే ముందు వివిధ రకాల తేనెపట్టెలు అందుబాటులో ఉన్నాయి. మీ అవసరాలకు తగిన పెట్టెలను ఎంచుకోవాలి.  

8 /10

తేనెపట్టు వ్యాపారానికి అవసరమైన లైసెన్స్‌లు రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఈ క్రింది లైసెన్స్‌లు అవసరం కావచ్చు: వ్యాపార లైసెన్స్, ఆహార ప్రాసెసింగ్ లైసెన్స్, లేబలింగ్ , ప్యాకేజింగ్ లైసెన్స్, పన్ను నమోదు వంటివి తప్పకుండా తీసుకోవాలి.

9 /10

తేనెపట్టు వ్యాపారం కోసం మీరు కేవలం రూ. 30 వేలు పెట్టుబడి పెట్టుకోవచ్చు. మీ వద్ద సరిపడ డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద లోన్‌ తీసుకోవచ్చు. తేనెపట్టు పెంచడానికి పెట్టెల కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక పెట్టె రూ.  50వేల నుంచి లక్ష తేనెటీగలు పడుతాయి.  

10 /10

సాధారణంగా ఒక బాక్స్‌ నుంచి 5 కిలోల తేనె వస్తుంది. మీరు కిలో తేనెను రూ. 800 వరకు అమ్మవచ్చు. ఇలా చేస్తే నెలకు రూ. 4 లక్షలు పొందవచ్చు. ఈ బిజినెస్‌కు ఎక్కువ డిమాండ్‌ రావాలంటే మీరు తేనెతో చేస్తే వివిధ రకాల ప్రొడెక్ట్స్‌ను కూడా అమ్మవచ్చు. ఇలా నెలకు రూ. 2 లక్షలు సంపాదించవచ్చు.