Hyderabad: హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆ రూటులో 45 రోజుల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic Restrictions At RGI Airport Road : సాధారణంగా ఏవైనా అభివృద్ధి పనులు జరిగిప్పుడు రోడ్డు మూసివేస్తారు. అయితే, ముందస్తుగా హైదరాబాద్‌ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్‌ ఇబ్బందులకు కాకూడదని ట్రాఫిక్‌ అప్డేడ్స్‌ కూడా ఇస్తారు.
 

1 /5

 ఈ సందర్భంగా  హైదరాబాద్‌ వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌. అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. అయితే, ఈ ట్రాఫిక్‌ మళ్లింపులు హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్ట్‌ (RGI)రూట్లలో వెళ్లేవారికి వర్తిస్తుంది.   

2 /5

సైబరబాద్‌ కమిషనర్‌ ఆర్‌జీఐ ఎయిర్‌ పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అభివృద్ధి పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.  ముఖ్యంగా శంషాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుకుండా అదేవిధంగా వాహనదారులు కూడా ఇబ్బందులు పడకూడదని చెప్పారు.

3 /5

ఈ సందర్భంగా రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌ కు వచ్చే కిషన్‌ గూడ ర్యాంప్‌  45 రోజులు మూసివేయనున్నారు. అందుకే రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలను బెంగళూరు ఎగ్జిట్‌ రోడ్డు ఓఆర్‌ఆర్‌ ట్రామా సెంటర్‌ NH-44 వద్ద యూటర్న్‌ చేయాల్సి ఉంటుంది.

4 /5

ఇక హైదరాబాద్‌ నుంచి రాజీవ్‌ గాంధీ ఎయిర్‌ పోర్టుకు వెళ్లాల్సిన వాహనాల యథావిధిగా వెళ్లేలా మార్గం సుగమం ఉంది. ఈ ట్రాఫిక్‌ మళ్లింపుల నిబంధన శనివారం నుంచే అమలులోకి వచ్చింది.  

5 /5

ఇదిలా ఉండగా ఈ ట్రాఫిక్‌ మళ్లింపులకు సంబంధించిన ప్రెస్‌ రిలీజ్‌ కూడా చేశారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఎప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు విధించాల్సి వస్తున్న ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేధికగా ముందుగానే తెలియజేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.