Big Alert To Tirumala Devotees: తిరుమల వెళ్లే భక్తులకు కీలక అలర్ట్ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లు పంపిణీ ముగియడంతో టీటీడీ కీలక ఆదేశాలను జారీ చేసింది.. ఈ నెల 19 తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా 20వ తేదీ నుంచి సాధారణ దర్శనం కొనసాగుతుంది. దీనికి సంబంధించి గురువారం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది టీటీడీ యంత్రాంగం.
తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10 నుంచి 19 వరకు ప్రత్యేక దర్శనాలను ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు కల్పించారు. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శనం 19వ తేదీకి ముగిస్తుంది. దీంతో 20వ తేదీ నుంచి భక్తులు సర్వదర్శనంలో క్యూ లైన్ లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది.
ఈనెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి విఐపి బ్రేక్ దర్శనం రద్దు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకొని భక్తులు సహకరించాలని అధికారులు కోరారు. నేటితో ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల పంపిణీ ముగుస్తుందని టీటీడీ యంత్రాంగం తెలిపింది.
ఈ వైకుంఠ ద్వార దర్శనం ఇప్పటివరకు సుమారు 5 లక్షలకు పైగా మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తుంది. వీరు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కూడా పొందారు.
గురువారం టిటిడి సమీక్ష నిర్వహించి ఈ నేపథ్యంలో జే శ్యామలరావు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం స్లాటెడ్ దర్శనం జారి శుక్రవారంతో ముగుస్తుంది. దీంతో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని 20వ తేదీ నుంచి యథావిధిగా సాధారణ దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు.
ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి టోకెన్లు జారీ చేయరు. సర్వదర్శనం చేసుకోవాలనే భక్తులు క్యూ లైన్ ల లోకి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోవాలని శ్యామల రావు సూచించారు. ఇక శ్రీవాణి దర్శనం టోకెన్లు 19వ తేదీ కూడా ఆఫ్లైన్లో నిలిపివేసి ఉన్నట్లు ప్రకటించారు.