BHEL: బీహెచ్‌ఈఎల్ బంపర్‌ నోటిఫికేషన్.. 400 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

BHEL Trainee Recruitment 2025: భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BHEL)ఇంజినీర్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ నోటిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. జనవరి 20 తేదీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోగలరు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇతర వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

బిహెచ్ఎల్ అధికార వెబ్సైట్లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ ఫిబ్రవరి 28 Creer.bel.in ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే దరఖాస్తు చేసుకోగలరు.  

2 /5

 నోటిఫికేషన్ ద్వారా 250 ఇంజనీర్ ట్రైనీ, 150 సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనుంది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుంచి 27 మధ్య ఉండాలి. డిప్లమా ఇంజనీరింగ్ బిటెక్ లేదా బీఈ పూర్తి చేసి ఉండాలి.  

3 /5

 ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామ్ కంప్యూటర్ బెస్ట్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో రిక్రూట్ మెంట్ ఆఫ్ ఇంజనీర్ ట్రైనీ, సూపర్వైజర్ ట్రైనీ 2025 పై ట్యాప్ చేయాలి.  

4 /5

 ఆ తర్వాత నెక్స్ట్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో 'అప్లై ఆన్లైన్' పై క్లిక్ చేయాలి. అందులో మీరు పూర్తి వివరాలు, కావలసిన డాక్యుమెంట్స్ ఫోటోగ్రాఫ్, సైన్ అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత చివరగా కన్ఫర్మేషన్ పేజీ వస్తుంది. దాని ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోవాలి. ఈ పోస్టులు మాత్రమే కాకుండా అదనంగా పిడబ్ల్యుడి అభ్యర్థులకు కూడా పోస్టులు భర్తీ చేస్తోంది.  

5 /5

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ 5 ఏళ్లు, పిడబ్ల్యుడి 10 ఏళ్లు, 13, 15 ఏళ్లు ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రుసుము రూ.295 చెల్లించాల్సి ఉంటుంది. దాన్ని డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. అయితే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూఈడీ రూ. 295 మాత్రమే చెల్లించాలి