Calcium Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఎముకలు పటిష్టంగా ఉండటం అవసరం. ఎముకలకు బలాన్ని చేకూర్చేది కాల్షియం. సాధారణంగా వయస్సుతో పాటు ఎముకలు బలహీనమౌతుంటాయి. ఫలితంగా ఎముకలు త్వరగా విరగడం, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు తలెత్తవచ్చు. ఎముకల్ని పటిష్టం చేసేందుకు కాల్షియం సమృద్ధిగా ఉండే పదార్ధాలు తప్పకుండా తినాలి. అలాంటి 5 ఆహార పదార్ధాలేవో తెలుసుకుందాం
ఆకు కూరలు పాలకూర, మెంతి కూర వంటి ఆకుకూరల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటిలో కాల్షియంతో పాటు విటమిన్ కే కూడా ఉంటుంది. ఎముకల ఎదుగుదల, పటిష్టతకు ఉపయోగపడతాయి.
పాల ఉత్పత్తులు పాలలో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. పాలు ఒక్కటే కాకుండా పన్నీరు, పెరుగు, మజ్జిగ కూడా తీసుకోవచ్చు. రోజూ ఒక గ్లాసు పాలు తాగితే ఎముకలకు బలం చేకూరుతుంది. ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది
సోయా ఉత్పత్తులు సోయా మిల్క్, టేఫూలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాల్షియంతో పాటు ఇతర ప్రోటీన్లకు ఇవి బెస్ట్. ఇవి క్రమం తప్పకుండా తీసుకుంటే కండరాలు, ఎముకలు బలంగా మారతాయి.
నువ్వులు నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎముకల్ని పటిష్టం చేసేందుకు, కీళ్ల నొప్పులు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది
బాదం బాదంలో కాల్షియం పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతోపాటు విటమిన్ ఇ, హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. రోజూ 5-6 బాదం తింటే ఎముకలు పటిష్టంగా మారడమే కాకుండా శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది