Bank Timings: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. మారనున్న బ్యాంకుల టైమింగ్స్‌..!

Bank Timings Change: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌ ఇకపై బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పు రానుంది. దీన్ని ముందుగానే ఖాతాదారులు తెలుసుకోవాలి. డిసెంబర్‌ నెలలోనే ఈ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

బ్యాంకు ఖాతా ఉన్నవారు ముఖ్యంగా బ్యాంకు పనిదినాలు, సమయం ముందుగానే తెలుసుకోవాలి. ఎన్నో రోజులుగా బ్యాంకులు ఐదు రోజులు పనిదినాలు చేస్తారని అంటున్నారు.  

2 /6

ఒకవేళ ఈ నిర్ణయం ఈ డిసెంబర్‌ నెలలోనే తీసుకుంటే ఉదయం 9.45 నుంచే బ్యాంకులు తెరుచుకుంటాయి. ఇక సాయంత్రం 5.30 వరకు బ్యాంకులు పనిచేస్తాయి. అంటే మొత్తంగా 40 నిమిషాలు బ్యాంకులు అదనంగా పనిచేస్తాయి.  

3 /6

ఇప్పటి వరకు బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు ఓపెన్‌ ఉంటున్నాయి. ఐదు రోజుల మాత్రమే బ్యాంకులు పనిచేస్తే ఈ బ్యాంకు సమయంలో మార్పుల రానున్నాయి.  

4 /6

ఇది కాకుండా బ్యాంకులకు ప్రతి ఆదివారం రెండో, నాలుగో శనివారాలు కూడా బంద్‌ ఉంటాయి. బ్యాంకుల 5 రోజుల పనిదినాలు అమలుల్లోకి వస్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి.  

5 /6

ఇక ఈ నెలలో బ్యాంకులకు 17 రోజులు సెలవులు రానున్నాయి. ఆయా ప్రాంతాల పండుగల ప్రత్యేక రోజులు ఆదివారం రెండో, నాలుగో శనివారాలు కలుపుకొని ఈ సెలవులు రానున్నాయి. ఇక మారనున్న బ్యాంకు సమయాల గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  

6 /6

ఎన్నో ఏళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజులు పనిదినాలను అమలు చేయాలని కోరుతున్నారు. దీనిపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం కూడా తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత 5 రోజుల బ్యాంకు పనిదినాలు అమలులోకి వస్తాయి.