September month 2024: కొంత మంది తరచుగా బ్యాంకులకు వెళ్లి తమ లావాదేవీలు చేస్తుంటారు. బ్యాంక్ లలో డిపాజిట్ లు, ఎఫ్డీలు,ఆర్డీలు చేయడం లేదా బ్యాంక్ లలో లోన్ లు, డబ్బులకు సంబంధించిన పనుల కోసం ఎక్కువగా వెళ్తుంటారు.
చాలా మంది బ్యాంక్ లకు తరచుగా అకౌంట్ కు సంబంధించిన పనుల కోసం వెళ్తుంటారు. లోన్ లు తీసుకొవడం, ఇతరాత్ర లావాదేవీల కోసం బ్యాంక్ లకు వెళ్తుంటారు. అయితే.. ప్రతినెలలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఇండియా బ్యాంక్ లకు కొన్ని సెలవుగా జాబితాను విడుదల చేస్తుంది. దీన్ని బట్టి వినియోగదారుడు తమ లావాదేవీల విషయంలో ప్లాన్ లు చేసుకుంటే.. ఇబ్బందులు ఉండవు.
రిజర్వ్ బ్యాంక్ ఇండియా ప్రకారం.. సెప్టెంబర్ మాసంలో సగం రోజుల పాటు బ్యాంక్ లకు హలీడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో బ్యాంక్ లోని పనులు పెట్టుకొకుండా..ముందే ప్లాన్ చేసుకుంటే మన సమయం ఎంతో ఆదా అవుతుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ మాసంలో హలీడే తేదీలను, ఎందుకు సెలవుగా ఉందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెలలో కూడా సెలవుల్ని ముందుగానే ప్రకటిస్తుంది. దీని ప్రకారం.. సెప్టెంబర్‌లో మొత్తం 14 సెలవులు ఉండనున్నట్లు సమాచారం. ఇందులో శని, ఆదివారాలు సెలవులు ఉన్నాయి. వినాయక చతుర్థి, ఈద్ మిలాద్ పండుగలు కూడా సెలవు జాబితాలో ఉన్నాయి.
కేరళలో గ్రాండ్ గా జరుపుకునే.. ఓనం, తిరువణం పండుగలు ఉండనున్నాయి. నారాయణ గురు జయంతి సందర్భంగా సెప్టెంబర్ 18, 21 తేదీలలో కేరళలో బ్యాంకులు మూసి ఉండనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 14 నుంచి 16 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మూడు రోజుల సెలవులు ఉంటాయి.
ఇందులో 16న ఈద్ మిలాద్ ఫెస్టివల్ కూడా ఉంది. సెప్టెంబర్ 13 నుంచి 16 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నట్లు తెలుస్తోంది. సిక్కింలో 14 నుంచి 17వ తేదీ వరకు నాలుగు రోజుల సెలవులు ఉన్నాయి. ఈద్ మిలాద్ కాకుండా శని, ఆదివారాలు మాత్రమే సెలవులు.
సెప్టెంబర్ 2024లో బ్యాంక్ సెలవుల జాబితా ఈ విధంగా ఉంది..సెప్టెంబర్ 5, గురువారం: శ్రీమంత శంకరదేవ తిథి (అస్సాంలో సెలవు), సెప్టెంబర్ 7, శనివారం: వినాయక చతుర్థి, సెప్టెంబరు 8: ఆదివారం సెలవు (ఒడిషాలో నౌకై పండుగ), సెప్టెంబర్ 13, శుక్రవారం: రామ్‌దేవ్ జయంతి, తేజ దశమి (రాజస్థాన్‌లో సెలవు)
సెప్టెంబర్ 14: రెండవ శనివారం (కేరళలో ఓనం), సెప్టెంబర్ 15: ఆదివారం సెలవు (కేరళలోని తిరువోణం), సెప్టెంబర్ 16, సోమవారం: ఈద్ మిలాద్, సెప్టెంబర్ 17, మంగళవారం: ఇంద్ర జాత్ర (సిక్కింలో సెలవు), సెప్టెంబర్ 18, బుధవారం: శ్రీ నారాయణగురు జయంతి (కేరళలో సెలవుగా ప్రకటించారు.
సెప్టెంబర్ 21, శనివారం: శ్రీ నారాయణగురు సమాధి (కేరళలో సెలవు), సెప్టెంబర్ 22: ఆదివారం సెలవు, సెప్టెంబర్ 23, సోమవారం: బలిదాన్ డే (హర్యానాలో సెలవు), సెప్టెంబర్ 28: నాల్గవ శనివారం, సెప్టెంబర్ 29: ఆదివారం సెలవుగా ఉంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)