HBD Balakrishna: ఎన్టీఆర్ నట వారసుడిగా అడుగుపెట్టిన బాలయ్య.. తండ్రికి తగ్గ తనయుడిగా రాణించారు. అంతేకాదు ఆయన చేసిన పలు పాత్రలు చేయడం కూడా ఒక రికార్డు. అంతేకాదు అన్నగారి బాటలో అన్ని జానర్స్ లో సినిమాలు చేసిన కథానాయకుడిగా రికార్డులు ఎక్కాడు.
తండ్రి ఎన్టీఆర్ బాటలో బాలయ్య చేసిన పాత్రలు.. ప్రత్యేక అనుబంధం. ఆయన బాటలో పలు పాత్రలు చేయడంతో పాటు ఆయన సినిమాలను రీమేక్ చేయడం విశేషం.
తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో నటించారు.
ఎన్టీఆర్ చేసిన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, దుష్యంతడు, అర్జునుడు, శ్రీ కృష్ణదేవరాయలు, హరిశ్చంద్రుడు వంటి పౌరాణిక పాత్రల్లో నటించిన బాలయ్య.
ఎన్టీఆర్ బయోపిక్ లో తండ్రి చేసిన అన్ని రకాల పాత్రలను ఆ సినిమాలో పోషించిన బాలకృష్ణ. తండ్రి బయోపిక్ లో అతను కుమారుడు హీరోగా నటించడం బహుశా బాలయ్యకు మాత్రమే సాధ్యమైంది. అంతేకాదు ఆయన చేసిన కథానాయకుడు, నిప్పులాంటి మనిషి, రాముడు భీముడు, రాము వంటి అన్నగారి టైటిల్స్ తో సినిమాలు చేయడం విశేషం.
కెరీర్ తొలినాళ్లలో తండ్రితో కలిసి పలు చిత్రాల్లో నటించారు.మొత్తంగా తన కెరీర్ లో ఎన్టీఆర్ తో కలిసి 12 చిత్రాల్లో కలిసి నటించారు. అంతేకాదు ఎన్టీఆర్ చేసిన ఒకప్పటి క్లాసిక్స్ ను బాలయ్య రీమేక్ చేయడం విశేషం. అందులో శ్రీరామరాజ్యం, రాముడు భీముడు, భైరవ ద్వీపం వంటి చిత్రాలున్నాయి.
హీరో అయ్యాకా.. తండ్రి స్వీయ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బ్రహ్మర్షి విశ్వామిత్రా చిత్రాల్లో నటించారు.
ఎన్టీఆర్ శ్రీ సత్యనారాయణ మహాత్యంలో భగవంతుడిగా.. భక్తుడిగా నటిస్తే.. పాండురంగడు సినిమాలో బాలయ్య భగవంతుడిగా.. భక్తుడి నటించారు.
బ్రహ్మర్షి విశ్వామిత్రలో ఎన్టీఆర్ టైటిల్ రోల్ విశ్వామత్రతో పాటు రావణాసురుడిగా నటించారు. బాలయ్య కూడా దుష్యంతుడు, హరిశ్చంద్రుడి పాత్రలో నటించారు.