Daaku Maharaaj Succes Meet: ఈ నెల 22న బాలయ్య అడ్డాలో ‘డాకు మహారాజ్’ విజయోత్సవ సభ..

Daaku Maharaaj Succes Meet: నందమూరి బాలకృష్ణ కు సంక్రాంతి హీరో అనే పేరుంది. అందుకు తగ్గట్టే.. ఈ యేడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా తొలి టాక్ నుంచే హిట్ సొంతం చేసుకొని మాస్ ఏరియాల్లో ఇరగదీస్తోంది. దీంతో ఇప్పటికే చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. తాజాగా ఈ మూవీ విజయోత్సవ సభను ఏపీలో తన అడ్డా అయిన అనంతపురంలో నిర్వహించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

 

1 /7

తెలుగు సీనియర్ టాప్ స్టార్స్ లో  బాలయ్య మంచి ఊపు మీదున్నారు.  వరుసగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల  తర్వాత తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీలతో వరుసగా నాల్గో విజయాలతో బాక్సాఫీస్ జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ సినిమా  సక్సెస్ నేపథ్యంలో ఈ నెల   22న అనంతపురంలో డాకు మహరాజ్ విజయోత్సవ సభను నిర్వహించబోతున్నారు.

2 /7

ఈ  నెల 9న అనంతపురంలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిద్దామనుకున్నారు. కానీ తిరుమలలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల ఇష్యూ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైయింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.  

3 /7

తాజాగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో చిత్ర యూనిట్ అనంతపురంలో విజయోత్సవ సభను నిర్వహించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

4 /7

అనంతపురంలో జరిగే ఈ సక్సెస్ మీట్ కు 25 మందికి పైగా హాజరు కానున్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర 8 రోజులు పూర్తి చేసుకున్న  ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 78 కోట్ల షేర్ (రూ. 150 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

5 /7

‘డాకు మహారాజ్’ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 78 కోట్ల షేర్ తో దాదాపు 98 శాతం బిజినెస్ రికవరీ పూర్తి చేసుకుంది. మరో రెండు రోజుల్లో ‘డాకు మహారాజ్’ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలవనుంది.

6 /7

మొత్తంగా వరుసగా నాలుగు సక్సెస్ లతో రూ. 100 కోట్ల గ్రాస్ అందుకోవడంతో పాటు వరుసగా నాలుగు రూ. 70 కోట్ల షేర్ అందుకున్న సీనియర్ హీరోగా బాలకృష్ణ తెలుగులో రికార్డు క్రియేట్ చేశారు.

7 /7

‘డాకు మహారాజ్’ మూవీ తమిళంలో కూడా మంచి వసూళ్లనే రాబడుతున్నట్టు సమాచారం. ఈ  సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాలో జరుగుతోంది. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవైపు బోయపాటి శ్రీను సినిమా తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారు బాలయ్య.