Almonds Side Effects: సాధారణంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ఇందులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ బాదంను సరైన విధానంలో తినకపోతే ఆరోగ్యానికి చాలా హానికరమని చాలామందికి తెలియదు. ఎంత ప్రమాదకరమంటే మద్యపానం కంటే డేంజర్. ఆశ్చర్యపోతున్నారా..ఆ కారణాలు మీ కోసం.
బాదం విషయంలో అప్రమత్తత అందుకే బాదం ఎప్పుడు తినాలన్నా నానబెట్టి ఉదయం తింటేనే మంచిది. రోజూ 4-5 బాదం తింటే ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలు కావల్సినంతగా లభిస్తాయి.
మద్యం కంటే ప్రమాదకరం బాదం సరైన పద్ధతిలో తినకపోతే మద్యం కంటే ఎందుకు ప్రమాదకరమౌతుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. బాదంను రాత్రంతా నీళ్లలో నానబెట్టకుండా తినడం వల్ల ఆ ప్రభావం జీర్ణక్రియతో పాటు ఇతర అంగాలపై పడుతుంటుంది. ఈ ప్రభావం దీర్ఘకాలంలో కన్పిస్తుంది. క్రమంగా సీరియస్ వ్యాధులకు తలెత్తవచ్చు. మద్యపానం కూడా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావమే చూపిస్తుంది. లివర్ పాడవుతుంది. అదే విధంగా బాదం సరైన పద్ధతిలో తినకుంటే దుష్పరిణామాలుంటాయి.
బాదంలో ఉండే పోషకాలు బాదంలో ప్రోటీన్లు, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మం సంరక్షణకు, కేశాల ఆరోగ్యానికి దోహదపడతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా రోజూ తగిన పరిమాణంలో తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
బాదం ఎలా తింటే మంచిది బాదంను ఎప్పుడూ రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం లేచాక నానబెట్టిన బాదం ఒలిచి తినాలి. దీనివల్ల సులభంగా జీర్ణమౌతుంది. ఎక్కువ పోషకాలు లభిస్తాయి.
బాదంను సరైన పద్ధతిలోనే తినకపోతే లివర్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటారు. అది కూడా మద్యపానం కంటే ఎక్కువ దుష్పరిణామాల్ని కల్గిస్తుంది. అందుకే బాదం ఎలా తింటే మంచిదో తెలుసుకోవాలి. బాదంలో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి చాలా లాభాలుంటాయి. కానీ సరైన పద్ధతిలోనే తినాలి