Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం

Pawan Kalyan Tollywood Producers Meet: ఏపీ ఎన్నికల ముందు, తర్వాత కొణిదెల, అల్లు కుటుంబం మధ్య తీవ్ర వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామంతో అది సమసిపోయినట్టు కనిపిస్తోంది. పవన్‌ కల్యాణ్‌తో అల్లు అరవింద్‌ సమావేశమయ్యారు. దీంతో రెండు తెలుగు సినీ కుటుంబాల మధ్య వివాదం సద్దుమణిగినట్టు తెలుస్తోంది.

1 /8

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన పవన్‌కు శుభకాంక్షలు తెలిపి అభినందించారు.

2 /8

Pawan Kalyan: విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ పరిశ్రమపై పవన్ కల్యాణ్‌తోపాటు సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌తో నిర్మాతలు చర్చించారు.

3 /8

Pawan Kalyan: ఏపీ ఎన్నికల ముందు తర్వాత కొణిదెల, అల్లు కుటుంబం మధ్య తీవ్ర వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు పవన్‌ కల్యాణ్‌తో దూరంగా ఉన్న అల్లు అరవింద్‌ ఈ సమావేశంలో ప్రత్యక్షమయ్యారు.  

4 /8

Pawan Kalyan: తెలుగు సినీ నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ భేదాభిప్రాయలను పక్కనపెట్టి ఈ భేటీకి హాజరయ్యారు.  

5 /8

Pawan Kalyan: అల్లు అరవింద్‌తోపాటు నిర్మాతలు అశ్వనీదత్, ఏఎం రత్నం, దగ్గుబాటి సురేశ్‌ బాబు, రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య , సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీ కృష్ణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.  

6 /8

Pawan Kalyan: సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.   

7 /8

Pawan Kalyan: త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, ఏపీలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించాలని నిర్ణయించారు.  

8 /8

Pawan Kalyan: ఈ సమావేశంతో ఏపీల్లో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమకు పూర్వ వైభవం రానుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.