Keerthy Suresh: బిస్కెట్ రంగు డ్రెస్సులో.. ఫిదా చేస్తున్న కీర్తి సురేష్!

Keerthy Suresh Bold pics: మహానటి సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న నటి కీర్తి సురేష్. తెలుగులో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ కి.. సౌత్ ఇండియా మొత్తం బాగానే క్రేజ్ ఉంది. ప్రస్తుతం త్వరలోనే బాలీవుడ్ డెబ్యూ కూడా ఇవ్వనుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. 
 

1 /5

తిరుమలకిషోర్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన సినిమా నేను శైలజ. ఈ చిత్రం అప్పట్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా.. మంచి విజయం అందుకుంది. కాగా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మలయాళీ బ్యూటీ కీర్తి సురేష్.   

2 /5

ఈ చిత్రం మంచి విషయం అందుకోవాదంతో పాటు కీర్తి సురేష్ కి ఎన్నో అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత కీర్తి సురేష్ నానితో చేసిన నేను లోకల్..సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే పూర్తిగా కీర్తి సురేష్ క్రేజ్ మార్చేసింది మాత్రం.. మహానటి సినిమా.

3 /5

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో కనిపించిన చిత్రం మహానటి. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అంతేకాకుండా కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. 

4 /5

మహానటి సినిమా చూసినవారు ఎవరైనా కీర్తిసురేష్ ని పొగడకుండా ఉండలేరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించింది అనడం కన్నా.. జీవించింది అని చెప్పొచ్చు. అంతలా ఈ సినిమాతో పేరు తెచ్చుకుంది ఈ హీరోయిన్.   

5 /5

ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా కీర్తి సురేష్ తెరంగేత్రం చేయనుంది. మరోపక్క ఇన్స్టాగ్రామ్ లోకి కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఆమె అభిమానులను ప్రేమలో పడేస్తున్నాయి.