Tomorrow Bank Holiday: ఆర్థిక లావాదేవీలు చేయడానికి బ్యాంకులు కీలకం. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. కానీ కొన్ని ప్రత్యేక పనులకు కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిందే.. దీనికి మనం ముందుగానే బ్యాంకు సమయాలు, పని దినాలు ముందుగానే తెలుసుకోవాలి. అయితే రేపు డిసెంబర్ 18వ తేదీ బుధవారం బ్యాంకులకు సెలవు దినంగా ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
బ్యాంకు సెలవులను ఆర్బిఐ నిర్ధారిస్తుంది. కొన్ని స్థానిక సెలవులు కూడా ఉంటాయి. ప్రత్యేక దినాల్లో కూడా సెలవులతో పాటు ప్రతి రెండు, నాలుగో శనివారాల్లో కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అంతేకాదు ప్రతి ఆదివారం కూడా సాధారణ సెలవు దినాలుగా పరిగణిస్తారు.
అయితే త్వరలో బ్యాంకు ఉద్యోగులు కేవలం ఐదు రోజుల్లో మాత్రమే పని చేయనున్నారు. ఎందుకంటే ఆ ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది.. ఇకపై ప్రతి శనివారం, ఆదివారం కూడా బ్యాంకులకు సెలవులు వస్తాయి. ఉద్యోగులకు కేవలం ఐదు రోజులే పని దినాలు ఉంటాయి. కానీ పని సమయం పొడగించనున్నారు.
రేపు డిసెంబర్ 18 బుధవారం రోజు బ్యాంకులకు సెలవు మేఘాలయలో ఈ సెలవు వర్తిస్తుంది. యు సో అనే రచయిత వర్ధంతి సందర్భంగా ఈ బంద్ పాటించనున్నారు. సో 1873 చీరపుంజి లో జన్మించారు.. ఆయన సంస్మరణార్థం రేపు మేఘాలయలో బంద్ పాటిస్తారు.
డిసెంబర్ 19 కూడా బ్యాంకులకు సెలవులు వర్తిస్తాయి. ముఖ్యంగా గోవాలోని పనాజీలో ఈ బ్యాంకు సెలవు వర్తిస్తుంది... గోవా 'లిబరేషన్ డే' సందర్భంగా ఆర్బిఐ ఈ సెలవు జారీ చేసింది. ప్రతి ఏడాది గోవా, డామన్ అండ్ డియూ లిబరేషన్ డే డిసెంబర్ 19వ తేదీన గోవాలో జరుపుకుంటారు. గోవాకు స్వాతంత్ర్యం పొందినందుకు గుర్తుగా ఈ లిబరేషన్ డే ను సెలబ్రేట్ చేసుకుంటారు.
అయితే బ్యాంకులు బంద్ ఉన్నా కానీ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి... బ్యాంకు సెలవుల్లో కూడా ఇవి యధావిధిగా ఇవి కొనసాగుతాయి. కేవలం బ్యాంకు బ్రాంచీలు మాత్రమే స్థానిక ప్రత్యేక దినాల ఆధారంగా బంద్ ఉంటాయి. ప్రధానంగా ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేయాలన్న, క్యాష్ డిపాజిట్ చేయాలన్న వారికి ఇబ్బంది.
రాష్ట్రాలు ప్రధాన పండుగ దినోత్సవాలు స్థానిక పండగల ఆధారంగా సెలవులు వర్తిస్తాయి. ప్రధానంగా రిపబ్లిక్ డే -జనవరి 26, స్వాతంత్ర దినోత్సవం -ఆగస్టు 15, గాంధీ జయంతి- అక్టోబర్ 2 ప్రధాన సెలవులు.
ఇవి కాకుండా కొన్ని ప్రత్యేక పండుగ దినాల్లో దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్, గురునానక్ జయంతి, గుడ్ ఫ్రైడే ,గణేష్ చతుర్థి, బుద్ధ పూర్ణిమ రోజుల్లో కూడా బ్యాంకులకు సెలవు దినాలు.