Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియోస్ .. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో కొలువు దీరడంలో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సంక్రాంతితో అన్నపూర్ణ స్టూడియో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దీని బాధ్యతలను అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం అన్నపూర్ణ స్టూడియో నెట్ మార్కెట్ విలువ ఎంతనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియో స్టూడియోను 5 దశాబ్దాల క్రితమే అక్కినేని నాగేశ్వరరావు తన భార్య పేరు మీదుగా ఈ స్టూడియోను స్థాపించారు. ఈ స్టూడియోను 1976 సరిగ్గా సంక్రాంతి రోజున అప్పటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్ చేతులు మీదుగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతితో పాటు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుతో పాటు ఎన్టీఆర్ సహా సినీ ప్రముఖులెందరో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఈ సంక్రాంతికి 49 యేళ్లు పూర్తి చేసుకొని 50వ వసంతంలోకి అడుగు పెట్టడం విశేషం.
ఈ స్టూడియోను 1975 అప్పటి ప్రభుత్వ సహకారంతో భాగ్యనగరంలో బంజారాహిల్స్ తో 22 ఎకరాల్లో ఆగష్టు 13న అక్కినేని ముద్దుల మనవడు సుమంత్ చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు. అంతేకాదు సరిగ్గా ఐదు నెలల్లో ఈ స్టూడియో లాంఛనంగా స్టార్ట్ చేయడం విశేషం.
ఇందులో తొలి సినిమా రామానాయుడు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ‘సెక్రటరి’ సినిమా తెరకెక్కడం విశేషం. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై ‘ప్రేమాభిషేకం’ ‘శ్రీరంగనీతులు’, విక్రమ్, శివ, నిన్నేపెళ్లాడతా, మన్మథుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈ బ్యానర్ పై తెరకెక్కినవే.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ బాధ్యతలను ఏఎన్నార్ కుమారులైన నాగార్జున, వెంకట్ లు చూసుకుంటున్నారు. నాగార్జున 1967లో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘సుడిగుండాలు’ సినిమాతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసారు. ఆ తర్వాత 1986లో పూర్తి స్థాయి హీరోగా ‘విక్రమ్’ సినిమాతో పరిచయమయ్యారు.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అలరాలుతున్నాయి. అందులో ఎన్నో ఫ్లోర్ సెట్లు, బిల్డింగ్ సెట్లు, అవుట్ డోర్ లొకేషన్స్, స్టూడియో ఫ్లోర్ లు , ఎడిటింగ్, డబ్బింగ్ సహా ఎన్నో సేవలను అందిస్తోంది. అంతేకాదు బిగ్ బాస్, అన్ స్టాపబుల్ వంటి ఎన్నో షోలు ఇక్కడ షూటింగ్ జరుపుకోవడం విశేషం. అంతేకాదు నగరం నడిబొడ్డున ఉండటంతో సినీ ప్రముఖులకు అనువుగా ఉంది.
ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో విలువ ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం భూమి రేట్.. దాదాపు రూ. 750 కోట్లు ఉంది. అందులో సెట్టింగ్స్.. ఇతరత్రా అన్ని కలిపి దాదాపు రూ. 2250 కోట్ల వరకు ఉంటుంది. ఇక నాగార్జునకు హైదరాబాద్ లో పెద్ద బంగ్లాతో పాటు ఎన్ కన్వెన్షన్ తో పాటు ఏపీతో పాటు చైన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీతో విదేశాల్లో భారీగా ఆస్తులున్నాయి. వాటన్నిటిని లెక్కలేస్తే దాదాపు రూ. 10 వేల కోట్లు ఉంటాయనేది అంచనా.