Pawan kalyan: పవన్ కళ్యాణ్ కు మరో బహుమతి.. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఏమిచ్చాడో తెలుసా..?

Pawan kalyan: జనసేన పవన్ కళ్యాణ్ కు తన వాళ్లనుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు వస్తున్నాయి. ఇప్పటికే తన వదినమ్మ సురేఖ కొణిదేల నిన్న(శనివారం)  కాస్లీ పెన్నును గిఫ్ట్ గా ఇచ్చింది. ఈ ఘటన మరువక ముందే ఆయన సాయిధరమ్ తేజ్ తన మామయ్యకు మరో సర్ ప్రైజ్ ఇచ్చాడు. 

1 /6

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనిలో భాగంగా ఇటీవల చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులందరికి ఆయా శాఖలను కూడా చంద్రబాబు కేటాయించారు. జనసేన పవన్ కళ్యాణ్ కు, డిప్యూటీ సీఎంతో పాటు, మరో ఆరు కీలక శాఖలను కేటాయించారు.

2 /6

ఈ నేపథ్యంలో నిన్న మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి పవన్ దగ్గరికి వెల్లి సర్ ప్రైజ్ చేశారు. సురేఖ కొణిదేల.. తన మరిదికి కాస్లీ పెన్నును కానుకగా ఇచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఎంతో ఎమోషనల్ గా ఫీలయ్యారు. నిన్న సోషల్ మీడియాలో అంతట.. పవన్ కళ్యాణ్ కు సురేఖ ఇచ్చిన పెన్ను ఖరీదేంతా..?.. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలంటూ అభిమానులు అన్న మాటలు ట్రెండింగ్ లో నిలిచాయి. 

3 /6

నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌తో సత్తా చాటిన జనసేనను, జనసేనాని చూసి అభిమానులు, కార్యకర్తలు గర్వపడుతున్నారు. పవన్ కు.. అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ వాల్ట్ డిస్నీ పెన్నును వదినమ్మ సురేఖ ఇచ్చారు. దీని విలువ రూ. 2.5 లక్షల వరకూ ఉంటుందని సమాచారం.

4 /6

ఈ క్రమంలో..  తాజాగా పవన్ కళ్యాణ్ మేనల్లుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ బహుమతి ఇచ్చారు. డిప్యూటీ సీఎం.. పవన్ కళ్యాణ్‌కి సాయి ధరమ్ తేజ్ ఐకానిక్ 'స్టార్ వార్స్ లెగో మిలీనియం ఫాల్కన్‌'ను బహుమతిగా ఇచ్చారు. దీని విలువ దాదాపు రూ. 1.2 లక్షలు. 

5 /6

ఈ గిఫ్ట్‌ను ఇస్తూ పవన్‌తో తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ గా పోస్టు పెట్టాడు. . "తనకు స్టార్ వార్స్, లెగోను పరిచయం చేసిన వ్యక్తి.. నా ప్రియమైన జేడీ మాస్టర్, డిప్యూటీ సీఎంకి  ఒక సర్ ప్రైజ్ ఇచ్చే  అవకాశం దక్కిందని కామెంట్ చేశారు. 

6 /6

చిన్నప్పుడు ఎన్నో బొమ్మలను కొనిచ్చిన పవన్ మావయ్యకి తిరిగి తన ఫేవరెట్ స్టార్ వార్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి.. సాయిధరమ్ తేజ్ తన ప్రేమను చాటుకున్నారు. ఇక ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మామ అల్లుళ్ల బంధం  పట్లు నెటిజన్లు అబ్బురపడుతున్నారు.