Kalidas Jayaram: గుట్టుచప్పుడు కాకుండా గుడిలో 'రాయన్‌' నటుడి వివాహం

Kalidas Jayaram Gets Married Tarini Kalingarayar: సినీ పరిశ్రమలో మరో వివాహం జరిగింది. తెలుగు వారికి సుపరిచితమైన మలయాళ నటుడు జయరామ్‌ కుమారుడు నాళిదాస్‌ జయరామ్‌ వివాహం చేసుకున్నాడు. విక్రమ్‌, రాయన్‌ చిత్రాల్లో నటించిన నటుడు కాళిదాసు వివాహం సాదాసీదాగా కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయంలో జరిగింది. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

1 /6

జయరామ్‌ ఎవరు: తెలుగు వారికి మలయాళ నటుడు జయరామ్‌ 'అల వైకుంఠపురములో, హాయ్‌ నాన్న, గుంటూరు కారం' వంటి సినిమాలతో సుపరిచితం.

2 /6

కాళిదాస్‌ ఎవరు: జయరామ్‌ కుమారుడు కాళిదాస్‌ జయరామ్‌ కూడా తెలుగు వారికి పరిచయమే. 'విక్రమ్‌, రాయన్‌' సినిమాల్లో కీలక పాత్ర కాళిదాస్‌ పోషించాడు.

3 /6

గుడిలో: జయరామ్‌ కుమారుడు కాళిదాస్‌ వివాహం అత్యంత సాదాసీదాగా..ఎలాంటి సందడి లేకుండా ఆలయంలో జరిగింది.

4 /6

గురువాయూర్‌లో: కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయంలో ఆదివారం వివాహమైంది. మోడల్‌ తరిణి కళింగరాయర్‌ మెడలో కాళిదాస్‌ మూడు ముళ్లు వేశాడు.

5 /6

రిసెప్షన్‌: పెళ్లికి రెండు రోజుల ముందు గ్రాండ్‌గా రిసెప్షన్‌ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో మలయాళంతోపాటు తమిళ్‌, తెలుగు సినీ ప్రముఖులు హాజరై కొత్త దంపతులను దీవించారు.

6 /6

స్పందన: తన కుమారుడి వివాహంపై నటుడు జయరామ్‌ స్పందిస్తూ.. "పెళ్లి గుడిలో జరగడం ఆనందంగా ఉంది. వధూవరులను ఆశీర్వదించిన వారికి కృతజ్ఞతలు. 32 ఏళ్ల కిందట జరిగిన నా పెళ్లి గుర్తుకువస్తోంది' అంటూ జయరామ్‌ తెలిపాడు.