సిక్కు తలపాగాపై జాత్యాహంకార వ్యాఖ్యలు

కెనడాలోని ఓ ఆర్మీ క్లబ్బులో తన స్నేహితులతో కలిసి పూల్ గేమ్ ఆడుతున్న ఓ సిక్కుపై అక్కడి దేశస్థులు కొందరు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు.

Last Updated : Feb 27, 2018, 04:29 PM IST
సిక్కు తలపాగాపై జాత్యాహంకార వ్యాఖ్యలు

కెనడాలోని ఓ ఆర్మీ క్లబ్బులో తన స్నేహితులతో కలిసి పూల్ గేమ్ ఆడుతున్న ఓ సిక్కుపై అక్కడి దేశస్థులు కొందరు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. ఆ క్లబ్బు ఆర్మీ క్లబ్బు కాబట్టి.. అక్కడి వెటరన్స్‌కు గౌరవ సూచకంగా ఎవరూ కూడా తలపై టోపీ గానీ హ్యాట్‌గానీ పెట్టుకోకూడదని చెబుతూ వారు ఆ సిక్కు యువకుడిని హెచ్చరించారు. ఆ తర్వాత అసభ్యపదజాలంలో దూషించారు.

ఒకామె ఆ సిక్కు తలపాగాను లాగివేయడానికి కూడా ప్రయత్నించింది. జస్విందర్ సింగ్ దలివాల్ అనే ఆ పేరు గల ఆ సిక్కు యువకుడు అది తమ మత ఆచారం అని చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన జరిగాక అదే క్లబ్బులో పలువురు భారతీయులు స్పందించారు. తలపాగా లేదా టోపీ పెట్టుకోవడం ఆ క్లబ్బులో నిషిద్ధం అయినప్పటికీ.. మతపరమైన డ్రస్సింగ్‌కు మాత్రం ఆ పరిమితులు వర్తించవని.. సిక్కులు తలపాగా పెట్టుకొని క్లబ్బులోకి రావచ్చని తెలిపారు. ఆ క్లబ్బుకి సంబంధించిన రూల్స్ బుక్‌లో అది ఉందని కూడా తెలిపారు. ఈ ఘటనపై స్పందిస్తూ క్లబ్బు  ప్రెసిడెంట్ స్టీఫెన్ గాలెంట్ మరోమారు క్లబ్బు నియమ నిబంధనలను పరిశీలిస్తామని.. తప్పు తమవైపు ఉంటే క్షమాపణ చెబుతామని తెలియజేశారు.

Trending News