కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అమలు చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నేటికీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశ భద్రత, జాతి సమైక్యత ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్టాన్ని తీసుకొచ్చామని, దీనిపై ఆందోలన అక్కర్లేదని బీజేపీ చెబుతోంది. అయితే సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను ప్రవేశపెట్టి మతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని, వీటిపై కేంద్ర సర్కార్ వెనక్కి తగ్గాలని కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: కాంగ్రెస్‌కు విపక్షాల షాక్.. వెలవెలబోయిన సీఏఏ సమావేశం!
Statement from Satya Nadella, CEO, Microsoft pic.twitter.com/lzsqAUHu3I
— Microsoft India (@MicrosoftIndia) January 13, 2020
తాజాగా సీఏఏపై టెక్ దిగ్గజం, మెక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టంలోని అంశాలు బాధిస్తున్నాయని, సరైన నిర్ణయం కాదని.. అందరికీ ఒకే విధమైన చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. బజ్ ఫీడ్ ఎడిటర్ బెన్ స్మిత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా సత్య నాదెళ్ల తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వలసవచ్చే ఓ వ్యక్తి భారత ఐకాన్ కావొచ్చునని, లేక ఇన్ఫోసిస్ తర్వాతి సీఈఓ అయితే చూడాలని ఉందని సత్య నాదెళ్ల చెప్పిన మాటల్ని బెన్ స్మిత్ ట్వీట్ చేశారు.
Asked Microsoft CEO @satyanadella about India's new Citizenship Act. "I think what is happening is sad... It's just bad.... I would love to see a Bangladeshi immigrant who comes to India and creates the next unicorn in India or becomes the next CEO of Infosys" cc @PranavDixit
— Ben Smith (@BuzzFeedBen) January 13, 2020
సోమవారం జరిగిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల తన అభిప్రాయాల్ని వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ ఇండియా తమ ట్విట్టర్‌లో సీఈఓ సత్య నాదెళ్ల స్టేట్‌మెంట్‌ను ట్వీట్ చేసింది. ‘ప్రతి దేశం తమ సరిహద్దులను నిర్దేశించుకోవచ్చు. దేశ భద్రతను, ఇమిగ్రేషన్ పాలసీలను నిర్ణయించవచ్చు. నేను భిన్న పద్ధతులు, ఆచారాలు ఉండే భారత్‌లో పెరిగాను. ఆపై అమెరికాకు వలసవచ్చాను. భారత్‌కు వలస వచ్చే వ్యక్తి ఏదైనా గొప్ప స్థానానికి ఎదగవచ్చునని’ సత్య నాదెళ్ల ప్రకటనలో పేర్కొన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..