Indian Students Died In UK: స్కాట్లాండ్‌లోని ఓ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. అయితే భారీ వేగంతో వస్తున్న వాహనం కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హైదరాబాద్ ప్రాంతీయుడైన పవన్ బాశెట్టి (23), నెల్లూరు చెందిన సుధాకర్ మొదెపల్లి (30), బెంగళూరుకు చెందిన గిరీష్ సుబ్రమణ్యం (23)దుర్మరణం చెందారు. వీరిలో అందరూ విద్యార్థులే. గిరీష్ ఏరోనాటికల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యాను అభ్యసిస్తుండగా.. సుధాకర్ తన కోర్సును గతేడాదే పూర్తి చేసినట్లు సమాచారం. సాయివర్మ(24) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మిగిత వారంతా.. అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదం ఈనెల 19న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో ఆ ట్రక్‌కు చెందిన 47 ఏళ్ల వ్యక్తినిఅదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థుల మృతదేహాలను భారత కాన్సులేట్ అధికారులకు అప్పగించారు అక్కడి అధికారులు.
స్వాదేశానికి మృతదేహాలు:
మృతదేహాలను వీలైనంత తొందరగా స్వాదేశానికి తరలించేందుకు UK ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్(INSA) సహాయం చేస్తొంది. అయితే ఈ సంస్థ ఇంగ్లండుకు చెందిన దైనప్పటికీ అన్ని దేశాల్లో సహాయ, సంక్షేమ చర్యలను చేస్తుంది. ఇతర దేశాల్లో విద్యార్థుల సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తోంది. అయితే బాధితులకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించి.. కుటుంబ సభ్యులకు వారి మృతదేహాలను అప్పగించే వరకు సంస్థ పని చేస్తుందని అధికార ప్రతినిధి కిషోర్ తెలిపారు. వీరు యూనివర్సిటీలో చెల్లించిన ఫీజును కూడా వెనక్కి ఇప్పించేందుకు కూడా సంస్థ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
చివరి ఫోన్ కాల్ అదే:
స్కాట్లాండ్‌లో మృతి చెందిన పవన్ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన వారు.. దీంలో అక్కడ విషాద ఛాయలు నెలకొన్నాయి. పవన్ తల్లిదండ్రులైనా బాశెట్టి జగదీష్, శ్యామల బోరున విలపిస్తున్నారు. ఈ కుటుంబం 11 సంవత్సరాల క్రితం నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు వలస రాగా.. ఇక్కడే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. అందులో పవన్ మొదటి కుమారు. 2021 డిసెంబర్‌లో అత్యున్నత స్థాయి విద్యాను అభ్యసిండానికి UK వెళ్లాడు. అయితే ఇదే ఏడాది స్వగ్రామానికి రావాల్సి ఉండగా.. ఇంతలోనే ఈ ఘటన జరగడం తల్లిదండ్రులకు తీరని లోటుగా మారింది.
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook