భారత్ లో బంధు మిత్రులకు ఇక ఎన్ఆర్ఐలు ( NRI ) వాట్సాప్, ఈమెయిల్ తో డబ్బు పంపించే వెసులుబాటు ఉంది. సోషల్ పే ( Social Pay) అనే క్రాస్ బార్డర్ రెమిటెన్స్ సర్వీస్ ద్వారా డబ్బులు సులభంగా పంపించవచ్చు. ఈ సర్వీసును 2018లో ఐసిఐసిఐ ( ICICI ) ప్రారంభించింది. దీని కోసం డబ్బు పంపించే వ్యక్తి ( Sender ) రిజిస్టర్ చేసుకోవాలి. Money2India లనే సర్వీస్ అప్లికేషన్ వినియోగించవచ్చు. తరువాత ఇండియాలో బంధుమిత్రులకు డబ్బు పంపించవచ్చు. ( Bank Holidays: ఆగస్టులో బ్యాంకు సెలవులు ఇవే )
Social Pay ను వినియోగించి ఎన్ఆర్ఐలు ఎలా డబ్బు పంపించవచ్చో ఐసిఐసిఐ వివరించింది.
- ముందుగా ఎంత డబ్బు పంపించాలి అనుకుంటున్నారో అది ఎంటర్ చేయండి.
- సోషల్ పే రిసిపియంట్ స్క్రీన్ ను ఎంచుకోండి. ఒక పాస్ కోడ్ సెట్ చేయండి. ట్రాన్సాక్షన్ వివరాలను ఎంచుకోండి
- ఈ లింకును వాట్సాప్ లేదా జీ మెయిల్ తో షేర్ చేయండి.
- పాస్ కోడ్ ను సెపరేట్ గా షేర్ చేయండి.
- ఈ లింకును క్లిక్ చేసి అందులో రిసిపీయంట్ లు వారి బ్యాంకు వివరాలు పొందుపరచవచ్చు.
- వెంటనే మీ Money2India App పై మీకు ఒక నోటిఫికేష్ వస్తుంది. ( First Time Sex Tips: తొలిసారి సెక్స్ చేసేవారికి టిప్స్ )
- నోటిఫికేషన్ ను సెలక్ట్ చేసుకుని, రివ్యూ చేసి, అన్ని పక్కాగా ఉన్నాయి అంటే ముందుకు వెళ్లండి.
యూజర్ జెనెరేట్ చేసిన లింకు కేవలం 24 గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. M2I App నుంచి వివరాలు మీరు బెనిఫిషరీ కాంటాక్ట్ కు సోషల్ మీడియా ప్రొఫైల్ లేదా ఈ మెయిల్స్ ద్వారా వారి బ్యాంకు వివరాలు ఎంటర్ చేసి ఈ ట్రాన్సాక్షన్ ను విజయవంతంగా ముగించవచ్చు.
లింకులో నాలుగు సంఖ్యల కోడ్ ఉంటుంది. దీని సెండర్ పంపిస్తాడు. దీన్ని బెనిఫిషరీ కాంటాక్ట్ తో షేర్ చేయాల్సి ఉంటుంది.
IPL 2020 UAE Facts: క్రకెటర్స్ భద్రత కోసం తీసుకోనున్న చర్యలివే