Grahan Yogam effect on Zodiac Signs: గ్రహాల రాజు సూర్యుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. మరో మూడు రోజుల్లో అంటే ఏప్రిల్ 14న ఆదిత్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. భానుడు మే 15 వరకు అదే రాశిలో ఉంటాడు. ఇప్పటికే దుష్ట గ్రహమైన రాహువు మేషరాశిలో కూర్చుని ఉన్నాడు. మేష రాశిలో సూర్యుడు మరియు రాహువు కలయిక వల్ల అశుభకరమైన గ్రహణ యోగం ఏర్పడుతుంది.
మరోవైపు శని గ్రహం యెుక్క మూడో దృష్టి సూర్యునిపై ఉంటుంది. సూర్యుడు, శని శత్రు గ్రహాలు కాబట్టి ఇది కూడా మంచిది కాదు. దీని కారణంగా ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 28 వరకు ఈ 4 రాశుల వారికి అస్సలు కలిసిరాదు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి: సూర్యుడు మరియు రాహువు సంయోగం వృశ్చిక రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. మీ కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. మీపై శత్రువులు విజయం సాధిస్తారు. మీకు ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. ఈ సమయంలో హార్ట్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండండి.
కుంభం: సూర్యుడు మరియు రాహువు యుతి కుంభ రాశి వారికి అననుకూలంగా ఉంటుంది. మీరు డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ దాంపత్య జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు మానుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంచండి.
Also Read: Guru Rahu yuti 2023: రాబోయే 7 నెలలు ఈ 4 రాశులకు కష్టాలు.. ఇందులో మీరున్నారా?
వృషభం: గ్రహణ యోగం వృషభ రాశి వారికి అస్సలు మంచిది కాదు. ఈ సమయంలో వీరి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీపై తప్పుడు ఆరోపణలు వస్తాయి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ టైంలో ఆస్తి ఒప్పందాలు కుదుర్చుకోవద్దు, లేకపోతే మీకు నష్టం జరగవచ్చు.
కన్య: సూర్య, రాహు కలయిక కన్యారాశి వారికి హాని కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. మీరు ఆర్థికంగా క్షీణించే అవకాశం ఉంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో గొడవలు తలెత్తుతాయి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
Also Read: Budh Gochar 2023: రాబోయే 58 రోజులు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు... ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి