పాక్ లో ఏకమైన ప్రతిపక్షాలు ; ఇమ్రాన్ ఖాన్ కు షాక్

ఇస్లామాబాద్: సభలో బలనిరూపణ కోసం సిద్ధమౌతున్న ఇమ్రాన్‌ఖాన్ కు ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.                 

Last Updated : Aug 3, 2018, 04:08 PM IST
పాక్ లో ఏకమైన ప్రతిపక్షాలు ; ఇమ్రాన్ ఖాన్ కు షాక్

ఇస్లామాబాద్: సభలో బలనిరూపణ కోసం సిద్ధమౌతున్న ఇమ్రాన్‌ఖాన్‌కు ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్థాన్ ముస్లింలీగ్, బెనజీర్ భుట్టో కుమారుడికి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఏకతాటిపైకి వచ్చాయి.  పార్లమెంటులో ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా విపక్షాల కూటమి తరపున అభ్యర్థిని నెలబెట్టేందుకు సిద్ధమౌతున్నారు. ఇతర చిన్న పార్టీలను కూడా కలుపుకుని కూటమిని ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌కు పూర్తి స్థాయి మద్దతు లేనందున ఆయన ప్రమాణ స్వీకారోత్సవంపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే తాజా పరిణామాలు ఇమ్రాన్ ఖాన్ కు ఏమాత్రం మింగుపడటం లేదని పలువురు అంటున్నారు.. ఏది ఏమైనప్పటీకి ఇవే  పరిణామాలు పాక్ ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠను రేపుతున్నాయి.

ఇటీవలే పాకిస్తాన్‌లో జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.  వాస్తవానికి పాక్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 172 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ రాకపోయినప్పటికీ.. 116 స్థానాలు సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇతర చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఇమ్రాన్ సిద్ధమయ్యారు. ఈ తరుణంలో ప్రతిపక్షాలు ఏకమై ఇమ్రాన్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమౌతున్నాయి.
 

Trending News