/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

AP Politics: ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారి తీసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వెనుక ప్రతిపక్షం ఎత్తులు అక్కడికి పరిమితం కాలేదని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకతను సమీకరించే ప్రయత్నాలు ప్రారంభమైపోయాయి.

ఏపీ అధికార పార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికలు రేపిన చిచ్చు ఇంకా చల్లారలేదు. విశేషమేమంటే జగన్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఎమ్మెల్యేలంతా రెడ్డి సామాజికవర్గానికి చెందినవాళ్లే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందనేది మరోసారి నిజమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేదికగా ఇది కాస్తా బయటపడినా అంతర్గతంగా చాలామందిలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. దాదాపు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తున్నా లోలోపల మాత్రం ఏదో తెలియని భయం వెంటాడుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి బయటపడినా, ఓటింగ్‌లో అది కాస్తా నిజమైంది. టీడీపీ నేతలు చెబుతున్న 40 మంది టచ్‌లో ఉన్న విషయం ఎంతవరకు నిజమో తెలియదు గానీ మరో ఎమ్మెల్యే గళం విప్పడం చర్చనీయాంశమైంది. 

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నెల్లూరు రెడ్ల నుంచి ప్రారంభమై కర్నూలుకు పాకింది. ఆనం రాంనారాయణరెడ్డి నుంచి మొదలైన అసమ్మతి స్వరం.. తరువాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటుకు దారితీసింది.  ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల వేళ నివురుగప్పిన నిప్పులా ఉన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవిల్లి శ్రీదేవి పార్టీకు వ్యతిరేకంగా ఓటేసి సస్పెండ్ అయ్యారు. ఈ పరిణామంతో టచ్‌లో ఉన్నారనే ఆరోపణల్ని టీడీపీ తీవ్రతరం చేసింది. 

Also Read: Summer Alert: ఠారెత్తనున్న ఎండలు, రానున్న 5 రోజుల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక జారీ

ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్సే సాయి ప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్న మాట వాస్తవమేనని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ అనుభవలేమితోనే ఇలా జరుగుతోందని చెప్పడం విశేషం. రెండవసారి సీఎంగా అవకాశమిస్తే జగన్‌కు పూర్తి అవగాహన వస్తుందన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. 

కారణాలు ఏమైనప్పటికీ, ఆ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా మరోసారి టికెట్ కష్టమేనని వైఎస్ జగన్ నిర్మొహమాటంగా చెప్పడం వల్లనే ఈ ఎమ్మెల్యేలు అధికార పార్టీకు వ్యతిరేకంగా గళం విప్పిన మాట నిజమే అయినా..ఏదో తెలియని భయం మాత్రం వెంటాడుతోంది. ఈ అసమ్మతి స్వరాల్లో ఉండవిల్లి శ్రీదేవి మినహాయించి మిగిలిన వారంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలే కావడం విశేషం. నెల్లూరు నుంచి కర్నూలుకు పాకిన అసంతృప్తి ఇంకెక్కడికి వెళ్తుందోననే ఆందోళన ఎక్కువౌతోంది. 

తాజాగా ఆదోని అధికార పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అలవోకగా చెప్పినవా లేదా ముందస్తు వ్యూహంలో భాగంగా చేసినవా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వైసీపీలో మాత్రం ఎన్నికల వేళ ఇది అనుకోని పరిణామమే.

Also Read: EX CM Kiran Kumar Reddy: బీజేపీలో చేరిన మాజీ సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి.. ఏ బాధ్యతలు అప్పగించినా రెడీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Section: 
English Title: 
Ap political equations gearing up amid recusant in ruling ysr congress party adoni mla raised voice against ys jagan
News Source: 
Home Title: 

AP Politics: ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? అసమ్మతి బాటలో ఆదోని ఎమ్మెల్యే..?

AP Politics: ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? అసమ్మతి బాటలో ఆదోని ఎమ్మెల్యే..?
Caption: 
Adoni MLA Saiprasad Reddy ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
AP Politics: ఏపీ అధికార పార్టీలో ఏం జరుగుతోంది..? అసమ్మతి బాటలో ఆదోని ఎమ్మెల్యే..?
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Saturday, April 8, 2023 - 06:41
Created By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
80
Is Breaking News: 
No