Surya Rashi Parivartan 2023: ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు.. మరో 9 రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్!

TSun Transit in 9 Days: మరో 9 రోజుల్లో సూర్యుడి గమనంలో పెనుమార్పు రాబోతుంది. సూర్యుడి రాశి మార్పు కారణంగా 5 రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 7, 2023, 09:06 PM IST
Surya Rashi Parivartan 2023: ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు..  మరో 9 రోజుల్లో మారనున్న ఈ రాశుల ఫేట్!

Surya Rashi Parivartan April 2023: జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. మీ జాతకంలో సూర్యదేవుడు శుభస్థానంలో ఉంటే మీకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఏప్రిల్ 14న సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఆదిత్యుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

సూర్యుడి సంచారం ఈ రాశులకు వరం
మేషరాశి 
మీ రాశిలో సూర్యుని సంచారం జరగబోతోంది, దీని ఫలితంగా మీరు మీ కెరీర్‌లో చాలా విజయాలను సాధిస్తారు. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు.  

మిధునరాశి
సూర్యుని రాశి మార్పు మిథున రాశికి చెందిన వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఆఫీసులో మీకు తగిన గౌరవం దక్కుతుంది. ధనలాభం ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Guru Uday 2023: మేష రాశిలో ఉదయించబోతున్న  బృహస్పతి..  ఈ 4 రాశుల ఇంటిపై డబ్బు వర్షం..

సింహరాశి 
సూర్యుడి గోచారం సింహ రాశి వారికి ఆర్థిక లాభాలను ఇస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలన్నీ దూరమవుతాయి. ఆర్థికంగా మీరు బలపడతారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే శుభ సమయం. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది.  

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి కెరీర్‌లో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. 

కుంభ రాశి
సూర్యుడి గోచారం కారణంగా మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది.  ధనలాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: Budh Vakri 2023: బుధ వక్రితో ఈ రాశులకు అదిరిపోయే బెనిఫిట్స్.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News