Symptoms of Vitamin B12 Deficiency: విటమిన్ బి 12 మానవ శరీరానికి చాలా అవసరమైన పోషకం. అటువంటి విటమిన్ B12ని శరీరం తనకు తాను తయారు చేసుకోదు కాబట్టి ఆహారం ద్వారా క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరం అని చెబుతున్నారు డాక్టర్లు. విటమిన్ B12ని ఎక్కువగా అందించేవి మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తులు. విటమిన్ B12 మన శరీరంలో అనేక విషయాల కోసం ఉపయోగించబడుతుంది. ముఖ్యంగా ఈ విటమిన్ B12 జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, రక్త ఉత్పత్తికి తోడ్పడుతుంది. అలాగే విటమిన్ B12 నాడీ సంబంధిత విధులను నిర్వహిస్తుంది, DNA ఉత్పత్తికి కూడా చాలా అవసరం.
విటమిన్ B12 లోపం కొన్ని సాధారణ సంకేతాలు చేతులు, కాళ్ళలో కూడా కనిపిస్తాయి, ఒకవేళ ఈ విటమిన్ B12 తక్కువగా ఉంటే వింత బెలూన్ లాగా చేతులు, కాళ్ళు వేలాడుతూ కనిపిస్తాయి అలాగే సాధారణంగా శ్వాస తీసుకునే సమయంలో కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక అదే కాకుండా ఈ విటమిన్ లోపం వల్ల, మీ శరీరంలో రక్త కణాల నిర్మాణం తగ్గుతుంది, ఆ కారణంగా మీ చేతులు మరియు కాళ్ళలో వాపు వస్తుంది.
విటమిన్ B12 లోపం లక్షణాలు
1. అలసట, శక్తి లేనట్టు అనిపించడం
2. నిరాశ, విచారం,
3. భావోద్వేగ స్థితులలో మార్పులు
4. గందరగోళం, ఆకలి లేకపోవడం, వికారం
5. మైకము లేదా మూర్ఛ
6. అతిసారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు
7. జుట్టు ఊడటం
8. శరీరం మీద రంధ్రాల లేదా ముడతల ఉత్పత్తి
9. పాలిచ్చే స్త్రీలలో కండరాల నొప్పులు
ఈ 5 ఆహారాల పదార్దాలు విటమిన్ B12 లోపాన్ని తొలగిస్తాయి
1. మాంసం : మాంసం (గొర్రె మాంసం, మేక మాంసం, కోడి మాంసం) విటమిన్ B12కి ఒక మంచి సోర్స్. ఇవి తీసుకుంటే విటమిన్ బి12 పెద్ద పరిమాణంలో లభిస్తుంది.
2. సీ ఫుడ్ : చేపలు, చేప నూనె, సముద్రపు ఆకుకూరలు వంటి సముద్ర ఆహారం. 6 ఔన్సుల వండిన సాల్మన్ చేపలో విటమిన్ B12 కోసం రోజువారీ అవసరాలలో 200% పైగా లభిస్తుంది.
3. పాలు -పాల ఉత్పత్తులు : పాలు, జున్ను, పెరుగు, నెయ్యి మొదలైనవి కూడా విటమిన్ B12ని పుష్కలంగా అందిస్తాయి.
4. గుడ్లు : గుడ్లు విటమిన్ B12కి మంచి సోర్స్. అందుకే విటమిన్ B12 లేదు అనుకుంటున్నా వారు దీన్ని ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా తినవచ్చు.
5. ఈస్ట్ ఫుడ్ : విటమిన్ B12 బ్రెడ్, పాస్తా, నూడుల్స్ మొదలైన ఈస్ట్ ఫుడ్‌లో కూడా సమృద్ధిగా లభిస్తుందని చెబుతున్నారు.
Also Read: Dil Raju Politics: రాజకీయాల్లోకి దిల్ రాజు.. అసలు విషయం చెప్పేశాడుగా!
Also Read: Surya Gochar 2023: సూర్య గోచారం దెబ్బ.. ఈ ఐదు రాశుల వారు అబ్బా.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook