Surya Grahan 2023 In India Date And Time: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2023 సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. వాటిలో మొదటి గ్రహణం సూర్యగ్రహణం ఏప్రిల్ రెండవ వారంలో సంభవించబోతోంది. అయితే ఈ గ్రహణానికి ఇంకా 15 రోజుల పాటు సమయం ఉంది. అయితే సూర్య, చంద్ర గ్రణాలు ఏర్పడినప్పుడల్లా ప్రతి రాశి చక్రంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశువారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశువారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతదేశంలో సూర్యగ్రహణం తేదీ, సమయం:
2023 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 20 ఏప్రిల్ 2023 ఉదయం జరుగుతుంది. సూర్యగ్రహణం ఉదయం 7.4 గంటలకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12.29 వరకు జరగనుంది. అయితే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయిన.. ప్రభావం మాత్రం పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సూతక్ కాలం, సూర్యగ్రహణం ప్రభావం:
భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించకపోవడం వల్ల ఎలావటి సూతక కాలం ఉండే అవకాశాలు లేవని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంవత్సరంలో జరిగే మొదటి సూర్య గ్రహంతో పలు రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మేషం:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ సూర్యగ్రహణం మేషరాశిలో జరగబోతోంది. కాబట్టి ఈ క్రమంలో మేషరాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీటితో పాటు సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ గ్రహణం కారణంగా కెరీర్లో సమస్యలు కూడా రావొచ్చు. అయితే ఈ క్రమంలో ఎంత ఓపికగా అంత మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కన్య:
సూర్యగ్రహణం కారణంగా కన్యారాశి వారికి కూడా చిన్న చిన్న సమస్యలు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. గ్రహణం క్రమంలో ఇతరులతో వివాదాలు పెట్టుకుని ఛాన్స్ ఉంది. కాబట్టి పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.
సింహ రాశి:
సింహ రాశికి సూర్యుడు అధిపతి.. సూర్యగ్రహణం కూడా ఈ రాశి వారిపై చాలా ప్రభావం చూపుతుంది. దీని కారణంగా ఈ రాశివారు తప్పకుండా కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా కూడా నష్టపోతారు. కాబట్టి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
మకర రాశి:
సూర్యగ్రహణం మకర రాశి వారిపై కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ రాశివారికి లాభాలు తగ్గి ఖర్చులు పెరిగొచ్చు. అంతేకాకుండా వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం
Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook