White Hair Treatment In Summer Season: నెమ్మదిగా సీజన్ మారుతోంది..చలి కాలం వెళ్లిపోయి వేసవి కాలం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చాలా మందిలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దుమ్ము, కాలుష్యం, హానికరమైన సూర్య కిరణాలు మీ జుట్టుపై పడడం వల్ల చాలా తీవ్ర జుట్టు సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొందరిలో జుట్టు తెల్లగా మారే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ఇలా క్రమంలో తప్పకుండా పలు హోం రెమెడీస్‌ని వినియోగించాల్సి ఉంటుంది. వాటిని వినియోగించడం వల్ల జుట్టు సిల్కీగా, మృదువుగా మారుతుంది. అంతేకాకుండా అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ హోం రెమెడీస్‌తో జుట్టు సిల్కీగా, మృదువుగా మారుతుంది:
1. వీలైనంత వరకు ఎండలో తిరడం మానుకోవాల్సి ఉంటుంది:
జుట్టు గరుకుగా మారడానికి ఎండ కూడా ఓ ప్రధాన కారణం. కాబట్టి మీరు కూడా మీ జుట్టును సిల్కీగా, షైనీగా మారడానికి ఎండలో వెళ్లడం మానుకోవాల్సి ఉంటుంది. ఎండలోకి వెళ్లే ముందు జుట్టును స్కార్ఫ్ లేదా టోపి ధరించి వెళ్లడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా హానికరమైన కిరణాలు మీ జుట్టుపై పడకుండా ఉంటాయి.
2. క్రమం తప్పకుండా గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయండి:
చాలా మంది జుట్టుకు నూనెను అప్లై చేయడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అందమైన జుట్టు పొందడానికి తప్పకుండా విటమిన్ ఇ, యాంటీ-ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉండే నూనెలను కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఈ నూనెలను క్రమం తప్పకుండా జుట్టు అప్లై చేస్తే తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. ఆవిరి పట్టించడం మానుకోవాలి:
తరచుగా చాలా మంది పార్లర్లో హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల జుట్టు చివర చిట్లి పోయే అవకాశాలున్నాయి. కాబట్టి ఆరోగ్యమైన జుట్టును పొందడానికి తప్పకుండా జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
4. కలబంద, పెరుగు మాస్క్:
జుట్టు సిల్కీగా, మృదువుగా, నల్లగా మారడానికి తప్పకుండా కలబంద, పెరుగు మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా జుట్టుకు పోషణనిచ్చి దృఢంగా, నల్లగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి సమ్మర్ తప్పకుండా ఈ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: Ram Charan Birthday : టాలీవుడ్ మొత్తం చిరంజీవి ఇంట్లోనే.. చెర్రీ బర్త్ డేకు దూరంగా నందమూరి ఫ్యామిలీ?
Also Read: Upasana Baby Bump Pics : రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు.. ఉపాసన బేబీ బంప్ పిక్స్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook