Aha New CEO Ravikant Sabnavis: ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అత్యంత అభివృద్ధి చెందుతోంది ఆహా. త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు రాబోయే మూడేళ్లలో రూ.1000 కోట్ల పెట్టుపెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న అజిత్ ఠాకూర్‌ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆహా స్టూడియోలో ముఖ్యమైన విభాగాలను పర్యవేక్షించనున్నారు. ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త రవికాంత్ సబ్నవీస్ కొత్త సీఈఓగా వెంటనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కొత్త జానర్లో ప్రాజెక్టులు చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తోంది.
ఆహా సంస్థ ప్రమోటర్ రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. రవికాంత్ కొత్త సీఈఓగా ఎన్నికైందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. అనేక పరిశ్రమలను విస్తరించిన ఆయన అనుభవం ఆహాకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మన దేశంలో స్వదేశీ వ్యాపారాల పెరుగుదల, కొత్త వెంచర్లను ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకతని అన్నారు. రవికాంత్ నాయకత్వంలో ఆహా అభివృద్ధిలో మరో దశకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఆహా సంస్థ ప్రారంభించినప్పటి నుంచి అజిత్ ఆహాతో ఉన్నారని అన్నారు. తెలుగువారి హృదయాలను కొల్లగొట్టే బ్రాండ్‌గా ఆహాను నిర్మించగలిగారని అభినిందించారు. తెలుగు నుంచి ఆహాను తమిళంలోకి విస్తరించారని అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. అజిత్ కొత్త పోస్ట్‌లోకి వెళ్లినా.. ఆహాకు మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటారని.. ఆహా స్టూడియోతో సహా కొత్త కార్యక్రమాలను నిర్మించడంపై దృష్టి పెడతారని చెప్పారు.
కొత్త సీఈఓ రవికాంత్ సబ్నవిస్‌కు 30 ఏళ్ల అనుభవం ఉంది. స్టార్ టీవీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ టీమ్, యునైటెడ్ బ్రూవరీస్, హీంజ్ ఇండియా, కొనాగ్రా ఫుడ్స్‌తో సహా విభిన్న కంపెనీల్లో పని చేశారు. ప్రస్తుతం TiE-ముంబై చార్టర్ సభ్యుడిగా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వెస్ట్రన్ రీజినల్ కౌన్సిల్ స్టార్టప్ & ఎంట్రప్రెన్యూర్షిప్ సబ్-కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం చూపి ఆనందించేలా ఆహాలో సరికొత్త షోలు, రోజువారీ సిరీస్ నుంచి సినిమాలు, గేమ్‌లు, వార్తలతో వినోద భరితంగా మారుస్తామని తెలిపారు.
100 శాతం లోకల్ కంటెంట్‌ను అందించాలనే ఉద్దేశంతో తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను 2020లో ప్రారంభించారు. ప్రతి శుక్రవారం వెబ్ సిరీస్‌లు, కొత్త సినిమాల విడుదలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో సక్సెస్ కావడంతో ఇటీవలె తమిళంలోనూ ప్రారంభించారు. త్వరలోనే మిగిలిన అన్ని ప్రాంతీయ భాషల్లో ఆహాను విస్తరించనున్నారు.
Also Read: BCCI: బీసీసీఐ కాంట్రాక్ట్ గ్రేడ్స్ ప్రకటన.. పాండ్యా, జడేజాకు ప్రమోషన్.. ఈ ప్లేయర్లు ఔట్..!
Also Read: IPL 2023: ఐపీఎల్ 2023లో ఈ ఐదుగురి ఆటగాళ్లపై ఓ కన్నేయండి.. క్రీజ్‌లోకి దిగితే బౌలర్లకు వణుకే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి